క్లాసిక్ హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి వార‌సుడితో హైద‌రాబాదీ గాళ్

Update: 2020-12-06 09:23 GMT
బాలీవుడ్ హీరోయిన్ లు టాలీవుడ్ చిత్రాల్లో న‌టించ‌డం శ‌రామామూలే. కానీ కొత్త‌గా హైద‌రాబాదీ అమ్మాయి అమ్రీన్ ఖురేషీ ఏకంగా బాలీవుడ్ లో పాపుల‌రై టాలీవుడ్ వైపు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌చ్చ గెలిచి ఇంట‌గెల‌వాల‌న్నారు.. ఇప్పుడు అదే సూక్తిని అమ్రీన్ ఖురేషీ పాటిస్తున్న‌ట్టుంది. తెలుగులో ఇంత వ‌ర‌కు ఏ మూవీ చేయ‌ని అమ్రీన్ ఖురేషీ హిందీలో ఏకంగా రెండు చిత్రాల్లో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది.

అవి కూడా తెలుగులో సూప‌ర్ హిట్ ‌లుగా నిలిచిన చిత్రాలే కావ‌డం విశేషం. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన `సినిమా చూపిస్త‌మావ‌` సినిమాని `బ్యాడ్ ‌బాయ్‌` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మిషి చ‌క్ర‌వ‌ర్తి హీరోగా న‌టిస్తున్నారు. ఇందులో అమ్రీన్ ఖురేషి హీరోయిన్ ‌గా న‌టిస్తోంది. రాజ్ కుమార్ సంతోషి ద‌ర్శ‌క‌త్వంలో సాజిద్ ఖురేషి నిర్మిస్తున్నారు.

స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ ‌లో జ‌రుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన అమ్రీన్ ఖురేషీ శంషాబాద్ ఏయిర్ పోర్ట్ లో సంద‌డి చేసింది. హైద‌రాబాద్ లో పుట్టిన అమ్రీన్ ఖురేషీ ఈ మూవీతో పాటు `జులాయి` ఆధారంగా రూపొందుతున్న రీమేక్ లోనూ న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు రిలీజ్ కాకుండానే హీరోయిన్ గా అమ్రీన్ ఖురేషీ య‌మ స్పీడుమీదుంది.
Tags:    

Similar News