బుల్లి తెరపై మెగా హీరోల పంట పండింది
ఈ కరోనా ఏమో కాని బుల్లి తెరపై సినిమాలకు ఇతర షోలకు విపరీతమైన టీఆర్పీ రేటింగ్ పెరిగింది. గతంలో ప్రదర్శితం అయిన సినిమాల ఇప్పుడు మళ్లీ ప్రదర్శితం అవుతున్నా కూడా భారీగా రేటింగ్ వచ్చి పడుతోంది. మొదటి సారి ప్రసారం చేసినప్పటి కంటే ఎక్కువ రేటింగ్ రావడం జరుగుతుంది. గత వారం స్టార్ మాటీవీలో వినయ విధేయ రామ చిత్రం ప్రసారం అయ్యింది. ఆ సినిమాకు 7.53 రేటింగ్ దక్కింది. అట్టర్ ఫ్లాప్ చిత్రంగా నిలిచిన ఆ సినిమాకు అంతటి రేటింగ్ రావడం చాలా గొప్ప విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వినయ విధేయ రామ చిత్రంతో పాటు చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రం కూడా బుల్లి తెరపై మరోసారి సత్తా చాటింది. 5.95 రేటింగ్ తో ధృవ చిత్రం గతవారం ప్రసారం అయిన సినిమాల జాబితాలో టాప్ లో నిలిచింది. చరణ్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా మూడవ స్థానంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం నిలిచింది. ఈ చిత్రంకు 5.7 రేటింగ్ దక్కింది. ఈ మూడు సినిమాలను కూడా గత వారం ప్రేక్షకులు పెద్ద ఎత్తున చూడటం జరిగింది.
ఇక తర్వాత స్థానాల్లో గీత గోవిదం 5.24 ఇంకా సిద్దార్థ వదలడు 5.08 రేటింగ్స్ తో నాలుగు అయిదు స్థానాల్లో ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే ఉంటూ టీవీలకు అతుక్కు పోయి సినిమాలు చూస్తున్న కారణంగా ఛానెల్స్ పంట పడుతుంది. కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా న్యూస్ బులిటెన్లకు పలు కార్యక్రమాలకు కూడా మంచి రేటింగ్స్ వస్తున్నాయి.