`HIT: ది ఫస్ట్ కేస్` హిందీ టీజర్ గ్రిప్పింగ్
టాలీవుడ్ హిట్ చిత్రం `HIT: ది ఫస్ట్ కేస్` హిందీలో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్ రావు ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. విక్రమ్ అతడి పాత్ర పేరు. కాప్ యాక్షన్-థ్రిల్లర్ కి చెందిన టీజర్ ని తాజాగా మేకర్స్ విడుదల చేసారు. ఇందులో విక్రమ్ పాత్రను పరిచయం చేసారు. టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా క్యూరియస్ గా సాగింది.
టీజర్ లో విక్రమ్ అనే పోలీసు తన గతంలోని రాక్షసులతో పోరాడుతున్నట్లు కనిపిస్తాడు. అతని ప్రస్తుత ఉద్యోగం బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెస్తుంది. విక్రమ్ తీవ్ర భయాందోళనలకు గురవుతాడు. తద్వారా అతని వర్క్ లైఫ్ కి ఆటంకం ఏర్పడుతుంది. HIT అంటే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. తప్పిపోయిన మహిళను వెతికే ఒక పోలీసు అధికారి కథను తెరపై ఆవిష్కరిస్తున్నారు. 2020లో అదే టైటిల్ తో తెలుగులో వచ్చిన హిట్ కి రీమేక్ ఇది. తెలుగు వెర్షన్ కథను యథాతథంగా రూపొందిస్తున్నారని తాజాగా విడుదలైన హిందీ టీజర్ చెబుతోంది. ఈ చిత్రానికి ఒరిజినల్ ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
మాతృక లో విశ్వక్ సేన్ పోషించిన పాత్రలో రాజ్ కుమార్ రావు కనిపిస్తుండగా.. ఇందులో రుహానీ స్థానంలో హిందీ ట్యాలెంటెడ్ నాయిక సన్యా మల్హోత్రా కథానాయికగా నటించారు. `HIT: ది ఫస్ట్ కేస్` చిత్రాన్ని భూషణ్ కుమార్ - దిల్ రాజు- క్రిషన్ కుమార్ - కుల్దీప్ రాథోడ్ నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ రావు- సన్యా మల్హోత్రా తొలిసారి జంటగా నటిస్తున్నారు. ఈ జోడీ గతంలో అనురాగ్ బసు సిరీస్ `లూడో`లో కొన్ని విభాగాలలో కనిపించారు. జూలై 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు `హిట్` లానే హిందీ వెర్షన్ కూడా హిట్టవుతుందని రాజ్ కుమార్ రావు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అతడికి సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Full View