అందాల వడ్డనకు సైసై కరోనా విరాళాలకు నైనై!

Update: 2020-03-27 12:10 GMT
కరోనా ప్రభావం ప్రపంచంలో అందరిమీదా ఏదో ఒక రూపంలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అసలు అభివృద్ధికి నోచుకోని దేశాల వరకూ ఏమాత్రం తేడా చూపించలేదు కరోనా. లైటర్ వెయిన్ లో చెప్తే సామాజిక న్యాయం వంద శాతం పాటించింది. ప్రిన్స్ ఛార్లెస్ నూ వదలలేదు అంటే కరోనా కఠిన సామాజిక న్యాయం ఏ స్థాయిలో ఉందో ఎవరికైనాఅర్థం అవుతోంది. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది ప్రజలకు ఉపాథి దూరం అయింది. నిత్యావసరాలకు కటకట నెలకొంది. దీంతో మన టాలీవుడ్ సెలబ్రిటీలు తమ వంతుగా సామాజిక బాధ్యతతో విరాళాలు ప్రకటిస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు.

ఎవరు ఎంత ఇస్తున్నారు అనే విషయం పక్కన పెడితే చిన్న హీరోల నుంచి పెద్ద స్టార్ల వరకూ.. కమెడియన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ తమకు చేతనైన విరాళం అందిస్తూ బాధితులకు..ప్రభుత్వానికి చేయూతగా నిలుస్తూ ఇతరులకు ప్రేరణనిస్తున్నారు. అయితే కోట్లు సంపాదించే భామలు మాత్రం పైసా కూడా విదిల్చకుండా సోషల్ మీడియాలో ఫోటోల తో వీడియోల తో కాలం గడుపుతున్నారు. 90% శాతం మంది హీరోయిన్లు ఇలా తమకేమీ పట్టనట్టు ప్రవర్తిస్తున్నారని.. సినిమా టైటిల్స్ కు ముందు వచ్చి ప్రేక్షకుల మనసులను కల్లోలభరితం చేసే ముకేష్ కు అచ్చమైన అక్కచెల్లెళ్ల తరహాలో 'కడుక్కోండి' అంటూ జఫ్ఫా జాగ్రత్తలు చెప్తున్నారు. అంతే కానీ ఒక్క రూపాయ కూడా తమ పర్సు నుంచి తీయడం లేదని సోషల్ మీడియాలో ఇప్పటికే సెటైర్లు పడుతున్నాయి.
Read more!

ఒకవైపు చాలామంది జనాలు బయట ఉపాథి లేక అల్లాడుతూ ఉంటే.. ఈ అందాల భామలు ఎంతో కొంత తమ వంతు సహాయం చేద్దామని అనుకోవడం లేదు. ప్రేక్షకుల వల్లేగా తామీ స్థాయిలో ఉన్నామనే ఆలోచన చేయడం లేదు. సహయం సంగతి అటకెక్కించి పాత హాటు ఫోటోలు..ఘాటు అందాల వడ్డనలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ భామల్లో చాలామంది ఛారిటీ షోలకు కూడా ఫీజు తీసుకునే రకాలని కూడా సెటైర్లు పడుతున్నాయి. అంటే.. పైకి మాత్రం అందంగా కనిపిస్తారు కానీ మనసులు మురికికూపాలు అన్నమాట. అలా అని అందరూ అదే బాపతు కాదు. కొందరు మంచి మనసుండే వారు కూడా ఉంటారు కదా. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ ప్రణీత రీసెంట్ గా లక్ష రూపాయలు విరాళం ప్రకటించి తన ఉదారత చాటుకుంది. ఇలాంటి ఒకరిద్దరు హీరోయిన్లు తప్ప మిగతా అంతా ఉత్తుత్తి మాటల బ్యాచేనని సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News