బొద్దుగుమ్మ ముద్దుగుమ్మలా మారిందే
చక్కనమ్మ చిక్కితేనే అందం.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలంటే ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందే. తమిళంలో హీరోయిన్లు కాస్త బొద్దుగా కనిపించినా అక్కడ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. పైగా వాళ్లను తెగ ఆదరిస్తారు. అందుకే పాలబుగ్గల హన్సిక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టినా కోలీవుడ్ లోనే సెటిలయింది.
ఈమధ్య తెలుగులో హన్సిక తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా బొద్దుగా కనిపించడం వల్లో ఏమో ఇక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ బ్యూటీ తిరిగి చెన్నై చెక్కేసింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి హన్సిక అందరికీ షాకిచ్చింది. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ కు వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోవడం జనాల వంతయింది. ఉన్నట్టుండి హన్సిక ఎంత స్లిమ్మయిపోయింది అంటే ఆమెను చూసిన వెంటనే పోల్చుకోవడమే కష్టమైపోయింది అక్కడికొచ్చిన జనాలకు. దానికి స్లీవ్ లెస్ గౌనుతో ధారాళంగా గ్లామర్ ఆరబోస్తూ వచ్చిన హన్సికను చూసి చాలామందికి నోట మాట రాలేదు.
బొద్దుగా ఉన్నంత కాలం ఇలాంటి మోడ్రన్ లుక్ తో హన్సిక బయట కనిపించలేదు. తాను ఎంత సన్నబడిందో ఈ ఒక్క లుక్ తో అందరికీ తెలియజెప్పేసిందని కోలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ లుక్ చూశాక ఇంక టాలీవుడ్ నిర్మాతలు- దర్శకులు కూడా ఆమెకు ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.