హన్సిక భాగమతి కాంబోకు 'నషా' ఫిక్స్‌

Update: 2020-12-16 06:49 GMT
పిల్ల జమీందార్‌.. భాగమతి వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు అశోక్‌ ఇటీవలే హిందీలో భాగమతి రీమేక్‌ చేశాడు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమా పూర్తి అవ్వక ముందే ఒక వెబ్‌ సిరీస్‌ ను ఈ దర్శకుడు మొదలు పెట్టాడు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ లకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా దర్శకుడు అశోక్‌ తో భారీ బడ్జెట్‌ తో అమెజాన్‌ ప్రైమ్‌ వారు వెబ్‌ సిరీస్‌ ను నిర్మించారు. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ లో హీరోయిన్‌ గా హన్సిక నటిస్తుంది.

హన్సిక విభిన్న పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ కు 'నషా'  అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ తో వచ్చే ఏడాది ఆరంభంలోనే వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు అమెజాన్‌ వారు సిద్దం అవుతున్నారు. ఈ సినిమాలో హన్సిక ను యూత్‌ ఆడియన్స్‌ కు నచ్చే విధంగా చూపించబోతున్నట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. నషా వెబ్‌ సిరీస్‌ తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఆమె తెలుగులో మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపును కలిగి ఉంది. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News