ప‌వ‌న్ లో ఆ గొప్ప గుణంపై ఆయ‌న చెబితే కానీ..!

Update: 2021-04-17 01:30 GMT
కొంద‌రు ఇంత సాయం చేస్తే అంత ప్ర‌చారం చేసుకుంటారు. కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే సాయం చేసేవాళ్లున్నారు. లేదా రాజకీయాల్లో దోచుకునేందుకు ఓట్ల క‌క్కుర్తితో సాయం చేసేవాళ్లున్నారు. కానీ ప‌వ‌న్ ఆ టైప్ మ‌నిషి కాదు. అత‌డు నిజ‌మైన జ‌న‌సేనాని. అందుకే ఇటీవ‌ల అత‌డికి అంత‌కంత‌కు రాజ‌కీయాల్లో ఇమేజ్ పెరుగుతోంద‌ని అభిమానులు ప‌దే ప‌దే చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ తో పాటు వ‌కీల్ సాబ్ లో క‌నిపించిన స‌హాయ‌న‌టుడు స్టేజీ ఆర్టిస్ట్ స‌మ్మెట గాంధీ చెప్పిన ఓ రెండు విష‌యాలు హృద‌యాన్ని ట‌చ్ చేశాయి. పవన్ చాలా సింపుల్ మనిషి అని సమ్మెట‌ గాంధీ అన్నారు. ఇతరులకు సహాయం చేయడానికి ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే త‌ర‌హా కాదు. తరచూ ఎలాంటి ప్రచారం లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. పవన్ ఇద్దరు క‌ళాకారుల‌కు సహాయం చేసిన రెండు ఉదాహరణ‌లున్నాయి. గుండె సమస్యతో బాధపడుతున్న పావాలా శ్యామల అనే కళాకారిణికి పవన్ సహాయం చేశారు. ఆపరేషన్ కోసం ఆమెకు 2 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఆమె సహాయం కోసం పవన్ ను సంప్రదించ‌గా.. పవన్ వైద్యులను స్వయంగా పిలిచి స‌ద‌రు ఆర్టిస్ట్ కు ఆపరేషన్ అయ్యేలా చూసారు.

అత్తారింటికి దారేది చిత్రీకరణ సందర్భంగా పవన్ తన కుమార్తె వివాహం కోసం జూనియర్ కళాకారిణికి సహాయం చేసార‌ట‌. తాను సెట్ నుండి బయలుదేరే ముందు తనను మ‌ర్చిపోకుండా అడ‌గాల‌ని జూనియర్ కళాకారిణితో ప‌వ‌న్ చెప్పారట‌. ఆమె అతన్ని పలకరించిన వెంటనే పవన్ తన పిఎను ఆమెకు 1 లక్ష ఇవ్వమని చెప్పారు. ఇలాంటి ఆపాత్ర‌దానాలు ఎన్నో. కానీ ఆయ‌న బ‌య‌ట‌కు చెప్పుకోరు. ప్ర‌చార హంగామాని కోరుకోరు అని స‌మ్మెట గాంధీ వెల్ల‌డించారు. అభిమానుల్లో ప‌వ‌న్ మానియా వెన‌క అస‌లు కార‌ణాలు ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయ‌న‌డానికి రుజువులున్నాయి.
Tags:    

Similar News