వ‌కీల్ సాబ్ రాగానే జ‌న‌సేన‌ను మ‌రిచారు!

Update: 2021-04-24 07:35 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిన‌దే. రాజ‌కీయాల‌కు అవ‌స‌రం మేర ప్రాధాన్య‌త‌నిస్తూనే సినిమాల్లో క‌థానాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. తాను ఇక‌పై పూర్తిగా రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించినా పార్టీని కాపాడుకోవ‌డం కోసం తిరిగి సినిమాల్లో న‌టించి ఆర్జించాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు.

దానికోస‌మే వ‌ర‌స‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేశారు. భారీ పారితోషికాలు అందుకుని దానిని పార్టీ ఫండ్ కోసం జ‌మ చేస్తున్నారు. ప‌వ‌న్ ఆలోచ‌న‌ను అభిమానులు అర్థం చేసుకున్నారు. ఇటీవ‌లే ప‌వ‌న్ కంబ్యాక్ మూవీ వ‌కీల్ సాబ్ రిలీజైంది. ఆ సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసేందుకు ప‌వ‌న్ అభిమానులు ఇంత‌టి క్రైసిస్ లోనూ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. త‌మ ఫేవ‌రెట్ సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసి ప‌వ‌నిజం అంటే ఏమిటో మరోమారు చూపించారు.

ఇక‌పైనా ప‌వ‌న్ న‌టిస్తున్న భారీ సినిమాలు రిలీజ్ కి రానున్నాయి. వాటిని బ్లాక్ బ‌స్ట‌ర్లుగా మ‌లిచేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక ప‌వ‌న్ ఒకసారి ముఖానికి రంగేసుకుని ఇటు రాగానే అంద‌రి దృష్టి ఇటువైపే ఉంది. వ‌కీల్ సాబ్ రాగానే జ‌న‌సేన‌ని అంతా మ‌ర్చిపోయారని ఇండ‌స్ట్రీలో హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. క‌రోనా క‌ల్లోలంలోనూ వ‌కీల్ సాబ్ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించిందంటే అది ప‌వ‌ర్ స్టార్ మానియా. అందుకే అత‌డు రాజ‌కీయాల్లో ఉన్నా సినిమాల్లో కొన‌సాగాల‌ని కోరుకుంటున్నారు అభిమానులు. జ‌న‌సేన‌ను ముందుకు న‌డిపిస్తూనే సినిమాల్లోనూ న‌టించాల‌ని ప‌వ‌న్ బ‌లంగా  నిర్ణ‌యించుకున్నారు. ప‌వ‌న్ త‌దుప‌రి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోని హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్నారు. దీంతో పాటు సురేంద‌ర్ రెడ్డి- హ‌రీష్ శంక‌ర్ స‌హా ఇత‌ర ద‌ర్శ‌కుల‌తోనూ సినిమాలు చేయ‌నున్నారు.
Tags:    

Similar News