వర్మ నోరు మూయించిన ఫారెస్ట్‌ ఆఫీసర్‌

Update: 2020-01-30 09:08 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఎలాంటి ట్వీట్‌ చేస్తాడో.. ఎలాంటి కామెంట్‌ చేస్తాడో ఆయనకే తెలియదు. ఆ సమయంకు ఆయన మనసులో ఉన్నది ట్వీట్‌ చేసేస్తు ఉంటాడు. తాజాగా ఒక వ్యక్తి గన్‌ తో జింక ను కాల్చి దాని తలను కత్తితో వేరు చేసే వీడియోను పోస్ట్‌ చేశాడు. సరే వీడియో పోస్ట్‌ చేశాడు అనుకుంటే దాంతో పాటు ఈ దేశంలో సల్మాన్‌ ఖాన్‌ కు ఒక న్యాయం ఇంకొకరికి మరో న్యాయమా అంటూ ప్రశ్నించాడు. వర్మ పోస్ట్‌ కు చాలా మంది కామెంట్‌ చేశారు. ఇన్నాళ్లకు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు అంటూ సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు చాలా మంది వర్మ ట్వీట్‌ కు రియాక్ట్‌ అయ్యారు.

ఆ ట్వీట్‌ కు ఒక ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కూడా రియాక్ట్‌ అయ్యాడు. ఆయన పేరు పర్వీన్‌ కాస్వన్‌. ట్విట్టర్‌ లో వర్మ పోస్ట్‌ చేసిన వీడియోకు స్పందించిన ఆయన.. మీరు అన్నది నిజమే అయితే మీరు ఈ విషయాన్ని ఇండియన్‌ పోలీసులను కాకుండా బంగ్లాదేశ్‌ పోలీసులను ప్రశ్నించాలన్నాడు. ఎందుకంటే ఇది జరిగింది బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ ప్రదేశంలో అంటూ పర్వీన్‌ అన్నాడు.

పర్వీన్‌ ఇచ్చిన రిప్లై కు వేల మంది రెస్పాండ్‌ అవుతున్నారు. వర్మ నోరు మూయించారు సర్‌ అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే వర్మ కు సరైన సమాధానం చెప్పారంటూ మరికొందరు పర్వీన్‌ ను అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం వర్మను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. మొత్తానికి వర్మ వీడియో మరియు ఆ వీడియో కు పర్వీన్‌ చేసిన కామెంట్‌ రెండు కూడా వైరల్‌ అవుతున్నాయి.
Tags:    

Similar News