ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అతనొక్కడే అర్థం చేసుకున్నాడు...!
మే 20న నందమూరి తారక రాముడి పుట్టినరోజు. దీని కోసం పది రోజుల ముందే తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు. కామన్ డీపీని 25 మంది టాలీవుడ్ ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేపించి హంగామా చేసారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే నాడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా నుంచి 'కొమరం భీమ్' ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో వస్తుందని.. సంబరాలు అంబరాన్ని అంటేలా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ 'కొమురం భీమ్' పాత్రలో తారక్ ఎలా ఉంటాడో చూడాలనుకున్న ఆయన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర యూనిట్ ఎలాంటి టీజర్ ను విడుదల చేయడం లేదని ప్రకటించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సైతం ''నా పుట్టినరోజు సందర్భంగా 'ఆర్.ఆర్.ఆర్' నుంచి ఎటువంటి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావడం లేదనే విషయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. అభిమానుల ఆనందం కోసం ఏదో ఒకటి విడుదల చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడిందనేది నాకు తెలుసు. అయితే అధికారిక ఆంక్షల వలన కురదలేదు'' అని ఒక లెటర్ ద్వారా విన్నవించుకున్నాడు.
''రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది'' అని తారక్ పేర్కొన్నారు. అలాగే తన బర్త్ డే నాడు ఫ్యాన్స్ అందరూ ఇంటి పట్టున ఉండాలని.. అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని సూచించాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్నటి నుండి తీవ్ర నిరాశా నిస్పృహలతో కూరుకొనిపోయున్నారు. ఈ తరుణంలో ఓ వ్యక్తి తాను తారక్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తానని అంటున్నాడు. ఆయనెవరో కాదు తారక్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. జింబాబ్వే కి చెందిన స్టీవెన్ తారక్ కి ఎప్పటి నుండో ఫిజికల్ ట్రైనర్ గా ఉన్నారు.
లాయిడ్ స్టీవెన్స్ ట్వీట్ చేస్తూ ‘‘రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తారక్ అభిమానుల కోసం నేనొక స్పెషల్ సర్‌ప్రైజ్ ను ఈరోజు సిద్ధం చేస్తున్నాను. వేచి చూడండి'' అంటూ వెల్లడించాడు. నిరాశలో ఉన్న అభిమానులను ఈ ట్వీట్ అంతో ఇంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ''పండగలా దిగి వచ్చావూ.. మా ఫ్యాన్స్ కి ఊపిరి అయ్యావు'' ''భాష రాకపోయినా నువ్వు ఒక్కడివే మా భాద అర్ధం చేసుకున్నావ్ భయ్యా'' అంటూ తారక్ ఫ్యాన్స్ అతన్ని కొనియాడుతున్నారు. లాయిడ్ స్టీవెన్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ను తారక్ బర్త్ డే కోసం ప్లాన్ చేసాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఎన్టీఆర్ కోసం ఒక ర్యాప్ సాంగ్ తో వస్తున్నాడు. 'ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్' పేరుతో రేపు ఉదయం 11 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. సో ఎన్టీఆర్ అభిమానులకు ఆర్.ఆర్.ఆర్ అప్డేట్ లేకపోయినా ఈ సర్ప్రైజ్ వీడియోలతో ఖుషీ అవబోతున్నారని చెప్పవచ్చు.