ఆ హీరోలు అక్కడే.. దర్శకులు మాత్రం
సినీ పరిశ్రమలో దర్శకుడిగా తొలి అవకాశం దొరకడమే కష్టం. అది దక్కి.. తనేంటో రుజువు చేసుకుంటే తర్వాత తిరుగుండదు. ఒక్క రోజులో జీవితం మారిపోతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. రిలీజైన రోజు సాయంత్రానికి దర్శకుడు కింగ్ అయిపోతాడు. ఇలా తొలి సినిమాతో హిట్ కొట్టి జీవితాల్ని మార్చేసుకున్న దర్శకులు ఎంతోమంది కనిపిస్తారు. తమలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ.. దర్శకుడిగా నమ్మి అవకాశాలు ఇచ్చివాళ్లు కొంతమందే ఉంటారు. కాబట్టి అప్పుడు హీరోల స్థాయిని చూసుకోరు. సినిమాలు చేస్తారు. కానీ సినిమా హిట్టయితే వాళ్ల స్థాయి మారిపోతుంది. ఇక ఆ హీరోలకు మళ్లీ దొరకరు. ఈ కోవలో కొందరు దర్శకుల్ని చూడొచ్చు.
ఇప్పుడు టాలీవుడ్ టాప్ రేంజ్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తరుణ్ తో చేశాడు. ఐతే రెండో సినిమాకే ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్సొచ్చింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం స్టార్లతోనే సినిమాలు చేస్తూ పోయాడు. తరుణ్ అనేవాడికి మళ్లీ త్రివిక్రమ్ కాంపౌండ్లోకి ఎంటరయ్యే అవకాశమే రాలేదు. అతను తర్వాతి కొన్నేళ్లలో అడ్రస్ లేకుండా పోయాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న అనిల్ రావిపూడి.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తీసిన ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఐతే ఇప్పుడు అతను నందమూరి హీరోకు దొరికే స్థితిలో లేడు. ‘ఎఫ్-2’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అనిల్.. ఏకంగా మహేష్ బాబుతో సినిమా తీసేయబోతున్నాడు.
తాజాగా ‘జెర్సీ’ సినిమాతో ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్న గౌతమ్ తిన్ననూరి.. తన తొలి సినిమా ‘మళ్ళీ రావా’ను సుమంత్ తో తీశాడు. ఆ సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాక ‘జెర్సీ’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు అతడి వైపు పెద్ద స్టార్లు చూసే పరిస్థితి. ఏకంగా రామ్ చరణ్ తో సినిమా అంటున్నారు. ఇక సుమంత్ తో మళ్లీ ఎప్పటికీ గౌతమ్ సినిమా చేసే అవకాశం లేనట్లే. ‘చి ల సౌ’తో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్.. తొలి సినిమాకు సుశాంత్ లాంటి హిట్, ఇమేజ్ లేని హీరోతో పని చేశాడు. ఆ సినిమాతో మెప్పించి ఏకంగా అక్కినేని నాగార్జునతో ‘మన్మథుడు-2’ తీసే ఛాన్స్ పట్టేశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చేదేమంటే.. తొలి అవకాశం ఏ స్థాయిది అని చూడకుండా టాలెంట్ చూపించడానికి ప్రయత్నించాలి. టాలెంట్ బయటపడితే ఇక తిరుగే ఉండదు.