సొసైటీ కోసమా? ప్రమోషన్ కోసమా?

Update: 2016-08-26 15:30 GMT
గౌతమ బుద్దుడి మాటలు విని అశోకుడు చెట్టులు నాటాడు నాటించాడు కాబట్టి.. ఇప్పుడు అదే పద్దతిలో ఒక ప్రక్కన తెలంగాణ ప్రభుత్వం.. ''హరిత హారం'' అంటూ మొక్కలు నాటిస్తుంటే.. మరో ప్రక్కన ''వనం-మనం'' అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నాటించేస్తోంది. కాని ఇలా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు నాటిస్తుంటే రాని కిక్కు.. మనోళ్ళకు సినిమా హీరోల పేరుమీద నాటుతుంటే వస్తున్నట్లుంది.

''జనతా గ్యారేజ్'' సినిమా వస్తున్న సందర్భంగా.. ''జనతా గ్యారేజ్‌ చాలెంజ్'' అంటూ ఒక మొక్కలు నాటే కాంపిటీషన్ మొదలెట్టారు. మొక్కలు నాటడం.. ఆ దృశ్యాన్ని ట్విట్టర్ లో షేర్ చేయడం.. వాటిని సదరు సినిమా వారు రీ-ట్వీటు చేయడం.. ఇదే పని. ఇప్పుడు మరి పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కూడా అలాంటిదే మరొకటి మొదలుపెట్టారు.. గతంలో ఓసారి మొదలెట్టి ఆపేసిన ప్లాంట్ ఫర్ పవన్ అనే సందడిని మళ్ళీ తెరమీదకు తెచ్చారు. ఇదంతా చూస్తుంటే.. అసలు వీళ్లు సొసైటీ కోసం నిజంగానే ఏదన్నా చేస్తున్నారా లేకపోతే ప్రమోషన్ల కోసమే ఈ హడావుడి చేస్తున్నారా అనే సందేహం రాకమానదు.

జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ టైములో ఇలా మొక్కలు నాటుతున్నారు సరే.. తరువాత ఏం చేస్తారు? పవన్‌ కళ్యాణ్‌ కోసం ఆయన పుట్టినరోజు సమీపిస్తున్నప్పుడల్లా మొక్కలు నాటితే సరిపోద్దా? అందుకే #PlantForPawan - #JanataGarageChallenge అని కాకుండా.. #PlantForLife - #MotherEarthChallenge అంటూ ఏడాది మొత్తం మొక్కలు నాటండయ్యా. హల్లో మర్చోయారేమో.. ఆ మొక్కలకు అప్పుడప్పుడూ వెళ్ళి నీళ్ళ కూడా పొయ్యండి.
Tags:    

Similar News