కరోనా దెబ్బకైనా స్టార్లకు సమయం విలువ తెలిసి వస్తుందా?
ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఎంత సమయం కావాలి అనేది ఎవరూ ఎవరూ చెప్పలేరు కానీ ఆరు నెలల కంటే ఎక్కువ సమయం కేటాయించడం అనవసరం అని ఇండస్ట్రీలో తలపండినవారు చెప్తారు. హీరో డేట్స్ అయితే మూడు నాలుగు నెలల సమయం మాత్రమే. అక్షయ్ కుమార్ హిందీలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తారు. 'అవతార్'.. టై'టానిక్' లకు మూడేళ్ళు నాలుగేళ్ళు అవసరమేమో కానీ సాధారణ ఫార్మాట్ సినిమాలకు అంత సమయం అవసరమే లేదు. అయినా మన స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఏడాది.. ఏడాదిన్నర తీసుకుంటారు. డైరెక్టర్లను రెండేళ్ళు వెయిటింగ్ మోడ్ లో ఉంచుతారు. దీనివల్ల పరిశ్రమకు నష్టం తప్ప మరొకటి లేదు.
పాత కాలంలో.. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే స్టార్ హీరోలు.. దర్శకులు అందరూ ఏడాదికి కనీసం ఐదారు సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్.. ఎఎన్నార్.. కృష్ణ లాంటి వారందరూ ఇలా చేసినవారే. మరి ఇప్పుడు మన హీరోలు.. దర్శకులు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? దీనికి ఏదో ఒక కారణం చెప్తారు కానీ ఒక ఉదాహరణ తీసుకుంటే పెద్ద ఎన్టీఆర్ 1977 లో ఆరు సినిమాలు చేస్తే మూడు బ్లాక్ బస్టర్లు. వాటి పేర్లు చెప్తే ఎవరైనా అదెలా సాధ్యమని ముక్కున వేలేసుకోవడం ఖాయం. 'దాన వీర శూర కర్ణ'.. 'యమ గోల'.. 'అడవి రాముడు' ఆ మూడు బ్లాక్ బస్టర్లు. ఇవి కాకుండా ఎన్టీఆర్ - ఎఎన్నార్ కలిసి నటించిన 'చాణక్య చంద్రగుప్త' కూడా ఆ లిస్టులో ఉంది. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ రెండిటికి దర్శకత్వం కూడా వహించారు. 'దాన వీర శూర కర్ణ'.. 'చాణక్య చంద్రగుప్త' ఆ రెండు.
ఇప్పుడు మన తరం హీరోలను.. డైరెక్టర్లను ఇవే ప్రాజెక్టులు చెయ్యమంటే కనీసం పదేళ్ళు లేదా పదిహేనేళ్ళు తీసుకోవడం ఖాయం. 'యమగోల'కు యమలోకం.. మర్త్యలోక.. పాతాళ లోకం.. సువర్లోకాల సెట్లు వెయ్యాలి.. నాలుగు స్టూడియోలు కావాలి.. గ్లోబల్ గా పలు దేశాల్లో ఇరవై వీ ఎఫ్ ఎక్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై పని చెయ్యాలి.. అంటూ ఒక్క 'యమగోల' ను ఐదేళ్ళు తీస్తారు. ఈ ఉదాహరణ ఎందుకు అంటే ఎన్టీఆర్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించి.. మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తే వాటిలో మూడు క్లాసిక్ ఫిలిమ్స్. అన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేని జోనర్లు. మరి ఇప్పుడు అలా ఎందుకు కుదరడం లేదు? టెక్నాలజీ పెరిగితే పని సులువు కావాలి కానీ పని ఆలస్యం ఎందుకు అవుతోంది?
మరి ఇంత జాగ్రత్తగా మన స్టార్ హీరోలు.. దర్శకులు ఏళ్ళకు ఏళ్ళు సినిమాలు తీసినా.. అవేమైనా అన్నీ క్లాసిక్స్.. బ్లాక్ బస్టర్లు అవుతున్నాయా అంటే అదీ లేదు. తిప్పికొడితే హిట్లు 15%లోపే కదా? మరెందుకు ఈ హంగామా? ప్రస్తుతం కరోనా దెబ్బకు అందరి కూసాలు కదిలిపోయాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లు ఏళ్ళకు ఏళ్ళు సమయం తీసుకోకుండా త్వరగా సినిమాలు చెయ్యాలని.. తద్వారా వడ్డీల భారం తగ్గుతుందని.. బడ్జెట్లు కూడా తగ్గించుకోవాలని అంటున్నారు. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని అంటున్నారు. టెక్నాలజీ అనేది ఫిలిం మేకింగ్ ను సులువు చెయ్యాలని.. అంతే కానీ క్లిష్టంగా మార్చకూడదని అంటున్నారు. సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పుకుంటే టైమ్ వేస్ట్ చేసుకోకూడదనే సందేశం కరోనా ఇస్తోంది.
కరోనాకి ఈ విషయానికి 'మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టినట్టు' ఉంది అని చెప్పొచ్చు. పైన చెప్పినట్టు చేసి ఉంటే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న పెద్ద సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయి ఉండేవి.. కొందరు డైరెక్టర్లు గత రెండేళ్లుగా ఖాళీగా ఉండేవారు కాదు. కొంతమంది హీరోలకు.. స్టార్ డైరెక్టర్లకు టైం విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందని కూడా అంటున్నారు. హీరోలు.. దర్శకులు అందరూ ఈ విషయంలో మారాలని కూడా కోరుతున్నారు.