• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #MeToo హీరోయిన్ వేధింపుల‌...

#MeToo హీరోయిన్ వేధింపుల‌ ఆరోప‌ణ‌ల‌ పై డైరెక్ట‌ర్ కౌంట‌ర్

By - Tupaki Desk
Update: 2020-09-20 23:30 GMT
నాకు ఫోన్ కాల్ దూరంలో క‌థానాయిక‌లు ఉన్నారు.. న‌న్ను న‌మ్మితే ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు! అంటూ గ‌దిలో గ‌డుసుగా ప్ర‌వ‌ర్తించాడు! అంటూ అందాల క‌థానాయిక పాయల్ ఘోష్ #MeToo వేదిక‌గా అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ పై ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌ పై అనురాగ్ స్పందించారు.

పాయల్ ఘోష్ #MeToo ఆరోపణ పై స్పందిస్తూ.. కంగనా రనౌత్ తన ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తోంద‌ని పరోక్షంగా ఆరోపించారు అనురాగ్.  పాయల్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్  తనను బలవంతం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కానీ ఆయ‌న కంగనా పేరు పెట్టకపోయినా అతను బచ్చన్ కుటుంబాన్ని తెర‌పైకి తీసుకురావడంతో పాటు పాయ‌ల్ కి వార్నింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. జయ బచ్చన్-కంగనా రనౌత్ ల పేర్ల‌ను ఈ గొడ‌వ‌లోకి లాగారాయ‌న‌.  ఒక మహిళ (కంగనా కావచ్చు) ఇతర మహిళలు (ఘోష్) తన పై అబ‌ద్ధ‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఈ గొడ‌వ‌లోకి లాగారని ఆరోపించడం ద్వారా అనురాగ్ తెలివిగా తన ట్వీట్లను ప్రారంభించాడు.

పాయ‌ల్ ఘోష్ ఆరోపించిన వెంటనే కశ్యప్ ఆత్మ‌ రక్షణ కోసం ట్విట్టర్ ‌లో కౌంట‌ర్లు స్టార్ట్ చేశారు. హిందీలో వ్యాఖ్యానిస్తూ.. ``వావ్ మీరు నన్ను చాలా కాలం నుండి సైలెంట్ చేయడానికి ప్రయత్నించారు. సమస్య లేదు. నన్ను నిశ్శబ్దంగా ఉంచేందు కోసం.. మీరు చాలా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇతరులు కూడా ఈ అబద్ధంలో చిక్కుకున్నారు. మేడమ్ నేను చెప్పదలచుకున్నది నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి`` అంటూ అనురాగ్ `ఆధారం` అన్న‌ పాయింట్ ను వాడారు.

నాపై ఆరోపిస్తూ నా నటులను (తాప్సీ పన్నూ) బచ్చన్ కుటుంబాన్ని లాగడం తదుపరి స్థాయి మేడమ్.. నేను రెండుసార్లు వివాహం చేసుకున్నాను. అది నేరం అయితే.. నేను వారిని చాలా ప్రేమిస్తున్నానని అంగీకరిస్తాను. నా మొదటి లేదా రెండవ భార్య .. ప్రేమికుల‌ను క‌లిసినా ఒక నిందితుడిలా ప్ర‌వ‌ర్తించ‌ను!  ఇంకా ఏమి జరుగుతుందో చూద్దాం`` అంటూ అనురాగ్ ఎమోష‌న్ అయ్యారు.

ఇటీవల కంగన యోధురాలిని అన్న‌ వ్యాఖ్యపై అనురాగ్ కౌంట‌ర్ తెలిసిన‌దే. న‌లుగురు గ్యాంగ్ ని తీసుకెళ్లి చైనాతో యుద్ధం చేయమని అనురాగ్ కంగనాను కోరారు. ఆ తర్వాత ఒలింపిక్స్ లో చేరమని కంగ‌న కౌంట‌ర్ వేసింది. అతను ఎప్పుడూ తెలివితక్కువవాడని అంది. ఈ గొడ‌వ త‌ర్వాత పాయ‌ల్ ఘోష్ వేధింపుల ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం అయ్యాయి.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS