జక్కన్న ఫ్యాన్.. అంటున్న కాపీ డైరెక్టర్

Update: 2017-05-30 04:51 GMT
ఎస్ఎస్ రాజమౌళిని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి2 సాధించిన ఘన విజయం ఆయన్ను ఆ స్థాయికి తీసుకెళ్లిపోయింది. గతంలో టాలీవుడ్ అంటే చిన్నచూపు చూసే బాలీవుడ్ జనాలు కూడా.. ఇప్పుడు జక్కన్నకు తాము అభిమానులం అయిపోయామని చెబుతున్నారు. అయితే.. ఓ దర్శకుడు ఇదే చెబుతున్నాడు కానీ.. ఇందుకు రీజన్ వేరేగా ఉంది.

నిర్మాత నుంచి దర్శకుడిగా మారిన దినేష్ విజాన్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్- కృతి సనోన్ జంటగా రాబ్తా మూవీని తెరకెక్కించాడు. అయితే.. ట్రైలర్ రిలీజ్ నుంచి ఇది టాలీవుడ్ మగధీరకు కాపీ అనే ఆరోపణలు వినిపించగా.. ఇప్పుడీ వివాదం కోర్టుకు కూడా చేరింది. రాబ్తాపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ మగధీర నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించగా.. ఇప్పటికో రాబ్తా టీంకి నోటీసులు కూడా అందాయి. దీనిపై ఇప్పుడు దినేష్ విజాన్ రియాక్ట్ అవుతున్నాడు. తాను రాజమౌళికి ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్ ని అని చెబుతున్న ఈయన.. తానెందుకు రాజమౌళి సినిమాని కాపీ కొడతానని నిలదీస్తున్నాడు.

'మన దేశంలో పునర్జన్మల మీద చాలానే సినిమాలు వచ్చాయి. కరణ్ అర్జున్.. మధుమతి.. ఓం శాంతి ఓం.. మగధీర.. ఈ సెగ్మెంట్ లో నేను ఓ మూవీ తీస్తున్నానంతే. మా సినిమా చూడమని.. ఒక్క సీన్ కూడా కాపీ ఉండదని మగధీర మేకర్స్ కు చెప్పాం. కానీ వారు కోర్టును ఆశ్రయించారు' అని చెబుతున్నాడు దినేష్ విజాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News