తెలుగులో ధనుష్ మరో క్రేజీ ప్రాజెక్ట్..??
దక్షిణాది స్టార్ హీరో ధనుష్.. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక స్టయిల్.. ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం తమిళం వరకే పరిమితం కాకుండా ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు తలైవా కూడా ఇలాగే ఓ భాషలో కెరీర్ ప్రారంభించి మెల్లగా ఇతర భాషల్లో సినిమాలు చేసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అల్లుడు ధనుష్ కూడా అదే బాటలో వెళ్తున్నట్లు కోలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ధనుష్ చేతిలో ఆల్రెడీ తమిళంతో పాటు హిందీ.. తెలుగు సినిమాలు ఉన్నాయి.
ఇటీవలే ధనుష్ బాలీవుడ్ ఫిల్మ్ 'ఆత్రంగి రే' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే తెలుగులో ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఓకే చేసాడు. ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో ఆల్రెడీ దర్శకుడు శేఖర్ కమ్ములతో త్రిభాషా చిత్రం ఓకే చేసాడు. ధనుష్ కు క్రేజ్ ఉన్నటువంటి తమిళ తెలుగు హిందీ భాషల్లో ఆ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ ఏడాది కర్ణన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ధనుష్. అలాగే అదే దర్శకుడు మారి సెల్వరాజ్ తో మరో మూవీ కూడా ఖరారు చేసుకున్నాడు. ఓవైపు హాలీవుడ్ లో ది గ్రేమ్యాన్ సినిమా.. మరోవైపు తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ తో సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత ఆ రేంజిలో మార్కెట్ జరిగేది టాలీవుడ్ లోనే. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని పరభాషా నటులు తెలుగులో అడుగు పెడుతుంటారు. కానీ వారు రాకపోయినా టాలీవుడ్ మేకర్స్ కూడా కొందరు నటులను తీసుకొస్తుంటారు. ఇప్పుడు అదే లిస్టులో ధనుష్ చేరాడు. తెలుగులో శేఖర్ కమ్ములతో ఫస్ట్ మూవీ ఇంకా మొదలుకాలేదు. అప్పుడే ధనుష్ గురించి మరో వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ధనుష్ సీక్రెట్ గా ఓ బడా ప్రొడక్షన్ లో మరో తెలుగు సినిమా ఓకే చేసాడని టాక్. ఆ సినిమాను ఓ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని సమాచారం. చూడాలి మరి వీటిలో ఎంతవరకు నిజముందో. ప్రస్తుతం ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.