‘కబాలి’ భయాలు సరిపోవని..
‘కబాలి’ సినిమా తమిళ ప్రేక్షకులకు కొంత వరకు నచ్చింది. అక్కడ వసూళ్లు కూడా పర్వాలేదు. నిజానికి సోషల్ మీడియాలో తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి పెదవి విరిచారు కానీ.. ఎందుకనో తమిళ మీడియా ఈ సినిమాను బాగా నెత్తికెత్తుకుంది. ఇది చాలా మంచి సినిమా.. జనాలు సరిగా అర్థం చేసుకున్నారన్నట్లుగా ప్రొజెక్ట్ చేసింది. దీంతో తెలుగు.. హిందీ భాషల్లో లాగా తమిళ ‘కబాలి’ తుస్సుమనలేదు. ఓ మోస్తరు వసూళ్లతో గుడ్డిలో మెల్ల అనిపించింది. ‘లింగ’ తర్వాత ‘కబాలి’ రజినీకి కొంత ఊరటనిచ్చింది. ‘కబాలి’ సంతృప్తినివ్వకపోయినప్పటికీ రజినీ దర్శకుడు పా.రంజిత్ మీద మళ్లీ నమ్మకం పెట్టారు.
రజినీ-రంజిత్ కాంబినేషన్లో రెండో సినిమా ఈ మేలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే అసలే ‘కబాలి’ భయాలు వెంటాడుతుంటే.. ఈ చిత్రానికి దీపికా పదుకొనేను కథానాయకగా ఎంచుకున్నారన్న వార్తలు కంగారెత్తిస్తున్నాయి. రజినీ అభిమానులకు దీపిక పేరెత్తితే ఒకరకమైన భయం కలుగుతుంది. ఆమెతో రజినీ ‘రాణా’ అనే సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా ముందుకు కదల్లేదు. ఆ తర్వాత ‘కోచ్చడయాన్’ కోసం ఇద్దరూ జత కట్టారు. ఆ సినిమా రిజల్ట్ ఏంటో తెలిసిందే. ఈ నేపథ్యంలో రజినీ-రంజిత్ సినిమాకు మళ్లీ ఆమెను కన్సిడర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలే ఆమె పారితోషకం రూ.10 కోట్లను దాటిపోయింది. ఆమె మీద సౌత్ ప్రేక్షకులకు ఏమంత పాజిటివ్ ఫీలింగ్ లేదు. అలాంటపుడు అంత పారితోషకం సమర్పించుకుని.. ఆమెను హీరోయిన్ గా చేయాలా అని సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తున్నాయి. మరి రజినీ-రంజిత్ ఆమె వైపే మొగ్గుతారా.. వేరే ఆప్షన్ కోసం చూస్తారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/