• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపికా పదుకొనే `హాలోవీన్...

దీపికా పదుకొనే `హాలోవీన్ డ్రగ్స్ పార్టీ` ప్ర‌కంప‌నాలు!

By - Tupaki Desk
Update: 2020-09-23 04:45 GMT
మాదకద్రవ్యాల కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దర్యాప్తులో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్మిక‌ మరణం కేసు కొత్త మలుపు తిరిగింది. సారా అలీ ఖాన్ - శ్రద్ధా కపూర్ పేరు తరువాత నటి దీపికా పదుకొనే పేరు ఎన్.‌సిబి దృష్టికి చేర‌డంతో ఆ మేర‌కు జాతీయ మీడియా క‌థ‌నాలు సంచ‌ల‌నాలుగా మారాయి.

దీపికా పదుకొనే ఆమె మేనేజర్ కరిష్మా మధ్య అక్టోబర్ 2017 నాటి వాట్సాప్ చాట్స్ ఆర్డీఎక్స్ బాంబ్ లా పేల‌నున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ ‌లో డ్రగ్ ఎక్స్ఛేంజ్ సజావుగా నడుస్తున్నట్లు ఈ చాట్లు వెల్ల‌డించాయ‌ని జాతీయ మీడియా పేర్కొంది. 28 అక్టోబర్ 2017న జ‌రిగిన‌ కోకో అనే అల్ట్రా మోడ్ర‌న్ ముంబై క్లబ్ ‌లో హాలోవీన్ పార్టీ జరిగింది.

ఎన్.సి.బికి దొరికిన అప్ప‌టి చాటింగ్ లో దీపిక `మాల్` ను అడగడం క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన కరిష్మా ప్రకాష్ నుండి హాష్ & కలుపును ఇచ్చిన‌ట్టుగా చాట్ బ‌య‌ట‌పడింద‌ని తెలుస్తోంది.  యాదృచ్ఛికంగా అదే రోజు చాటింగ్ చేస్తున్నప్పుడు కరీష్మా ప్ర‌కాష్ కోకోకు ఎప్పుడు చేరుకుంటారు? అంటూ దీపిక‌ను అడిగారు.

కోకో ముంబైలోని పార్టీల హాట్ స్పాట్ .. అనేక మంది ఎ-లిస్టర్లు కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ చాట్లు 28 అక్టోబర్ 2017 నాటివి. అదే రాత్రి కోకోలో ఒక పార్టీ జరిగింది. దీనికి దీపిక- సిధార్థ్ మల్హోత్రా- సోనాక్షి సిన్హా- ఆదిత్య రాయ్ కపూర్ త‌దితరులు హాజరయ్యారు.

వాస్తవానికి కోకో క్లబ్ పార్టీ ఫోటోల‌ను రెండు రోజుల తరువాత వారి ఫేస్ బుక్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇక్కడ తలెత్తే పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఈ పార్టీ కోసం కరిష్మా ప్ర‌కాష్ ను దీపిక డ్రగ్స్ అడిగారు? ఆ రాత్రి కోకోలో జరిగిన హాలోవీన్ థీమ్ పార్టీలో అసలు ఏమి జరిగింది? అన్న‌దానిపైనా ఎన్.సి.బి ఆరాలు తీస్తోంద‌ని జాతీయ మీడియా వెల్ల‌డించింది.

దీనిపై ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్ సోనాక్షి సిన్హా.. సిద్దార్థ్ మల్హోత్రా.. ఆదిత్య రాయ్ కపూర్లను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ మెసేజ్ కి సమాధానం ఇవ్వలేదని క‌థ‌నాలొచ్చాయి. త్వరలోనే దీపికాను ఎన్‌సిబి విచార‌ణ కోసం పిలుస్తుందని భావిస్తున్నారు. ఈ నటి ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ కోసం గోవా షూటింగ్ ‌లో ఉంది. మ‌రోవైపు నిన్న‌టిరోజున‌ చెన్న‌య్ లో ఓ షాప్ ఓపెనింగుకి హాజ‌రై షాకిచ్చింది దీపిక‌.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS