క్రికెట్ వరల్డ్ లో శ్రీవల్లి ఫీవర్ ఇప్పట్లో తగ్గెదేలే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సక్సెస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో సైతం ఊహించని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇందులో ప్రతీ సీన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిందే. సినిమాలో డైలాగులు..పాటలు..డాన్సులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక `శ్రీవల్లి` పాట వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. విదేశీ సింగర్లు..మ్యూజిక్ బ్యాండ్లు సినిమాలో పాటల్ని..స్టెప్పుల్ని తమదైన శైలిలో రీక్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ క్రికెట్ ని పుష్పరాజ్ ఓ రేంజ్ లో ఊపేసాడు. రవీంద్ర జడేజా..శిఖర్ ధావన్..సురేష్ రైనా..హార్దిక్ పాండ్యా తో పాటు విదేశీ క్రికెటర్లు శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్పులు మర్చిపోలేం.
ఇక డేవిడ్ వార్నర్ అయితే `పుష్ప` కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. శ్రీవల్లి పాటతో పాటు.. వీడియోని షేర్ చేసి బోలెండంత పాపులారిటీ తెచ్చిపెడుతున్నాడు. తాజాగా ఈ జాబితో రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరారు. శ్రీవల్లి పాటకు తనదైన మార్క్ రీక్రియేషన్ చేసారు. బ్యాటు పట్టుకుని పాటకు స్టెప్పులేసి ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చారు. దీంతో అభిమానులు అశ్విన్ స్టెప్పులకు ఫిదా అవతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు..ఎమోజీలు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. మొత్తానికి పుష్ప ఈ రేంజ్లో సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. పాన్ ఇండియా సక్సెస్ కి అసలైన అర్ధాన్ని `పుష్ప` తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
సోషల్ మీడియా కారణంగా పాన్ వరల్డ్ కి రీచ్ అయింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో పాపులర్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా భారీ బడ్జెట్ చిత్రాలు..కంటెంట్ ఉన్న చిత్రాలున్నాయి. కానీ వాటికి దక్కని ఆదరణ `పుష్ప` చిత్రానికి దక్కింది. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఓ తెలుగు సినిమా గురించి చర్చ జరుగుతుందంటే ఆ క్రెడిట్ అంతా సుకుమార్-బన్నీదే. సుకుమార్ క్రియేటివిటీ..బన్నీ శ్రమ పుష్పని ఆ స్థాయిలో నిలబెట్టాయి.
Full View