ట్రెండింగ్: థియేట‌ర్ల‌పై క‌రోనా మాఫియా క‌ర్చీఫ్‌

Update: 2020-04-13 04:45 GMT
లాక్ డౌన్ తో టాలీవుడ్ అష్ట‌దిగ్భంద‌నంలోకి వెళ్లిపోయింది. నిర్మాత‌ల‌కు.. థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు భారీగా న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. లాక్ డౌన్ ఎత్తేశాకా కొన్నాళ్ల పాటు ఇబ్బందులు త‌ప్ప‌వు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో  తెలియ‌ని స‌న్నివేశం ఉంది. ఇప్ప‌టికే ఏప్రిల్ 30 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగింపు ఉంటుంద‌ని  దాదాపు ఖ‌రారైపోయింది. అయితే క‌రోనా వైర‌స్ అప్ప‌టికీ అదుపులోకి రాక‌పోతే మ‌రో రెండు నెల‌ల పాటు లాక్ డౌన్ కొన‌సాగించ‌డానికి కేంద్ర-రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు వెనుకాడ‌వని  నివేదిక‌లు చెబుతున్నాయి. ఒక‌వేళ ప్ర‌భుత్వం  కొంత స‌డ‌లింపు ఇచ్చినా... థియేట‌ర్లు..షాపింగ్ మాల్స్ జ‌న స‌మూహాలు పోగు ప‌డే చోట్ల వ్యాపారాల్ని ప్ర‌భుత్వాలు అనుమ‌తించే ఛాన్సే లే‌ద‌ని తెలిసింది. ఆ మూడింటిని నిషేధిస్తూనే లాక్ డౌన్ స‌డ‌లిస్తామ‌ని ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి విధిత‌మే.

తాజా స‌న్నివేశం నేప‌థ్యంలో టాలీవుడ్ కి న‌ష్టం ఊహించిన దానికంటే ఎక్కువేనని అంచ‌నా వేస్తున్నారు. స‌రిగ్గా ఈ లాక్ డౌన్ స‌న్నివేశాన్ని ఓ రాజ‌కీయ నాయ‌కుడు.. బిజినెస్ కోసం వాడేస్తున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. స‌ద‌రు నాయ‌కుడి ఎంట్రీ తో థియేట‌ర్ మాఫియా కొత్త రూపాన్ని సంత‌రించుకుంటుంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.  స‌ద‌రు పొలిటీష‌న్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేట‌ర్లు కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌.  ఆ ర‌కంగా ఇప్ప‌టికే టాలీవుడ్ ఉన్న ప్ర‌ముఖ నిర్మాత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపాడుట‌. ఇప్ప‌టికే థియేట‌ర్లు ఆ న‌లుగురి చేతిలో ఉన్నాయ‌ని...వాళ్లు చెప్పిందే వేదంగా భావించి వ్య‌వ‌స్థ‌ న‌డుస్తోంద‌ని చిన్న నిర్మాత‌లు ఎన్నోసార్లు ల‌బోదిబో మ‌న్నారు. తాజాగా ఈ పొలిటిష‌న్ ఎంట్రీ తో సిండికేట్ విధానం కొత్త రూపం దాల్చ‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే ఆ షాడో పొలిటీషియ‌న్ ఏఏ నిర్మాత‌ల‌తో డీల్ కుదుర్చుకుని పావులు క‌దుపుతున్నాడు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

లాక్ డౌన్ స‌మ‌యంలో ఇబ్బందుల్లో ఉన్న థియేట‌ర్ యాజ‌మాన్యాల‌ను గుర్తించి వాళ్ల నుంచి త‌క్కువ ధ‌ర‌కు వాటిని లీజుకు తీసుకోవ‌డం .. కుదిరితే కొనేయ‌డం అనే బిగ్ స్కెచ్ వేశాడ‌ట‌. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌? ఆ పొలిటీష‌న్ కం షాడో మాఫియా ఎవ‌రు?  అన్న‌ది క్లియ‌ర్ క‌ట్ గా తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే ఉన్న థియేట‌ర్ల సిండికేట్ విధానంతో చిన్న సినిమా నిర్మాత‌లు  త‌మ  సినిమాల‌ను రిలీజ్ చేసుకోవ‌డానికి నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. సినిమాలో విష‌యం ఉంటే..అదీ పెద్ద డిస్ట్రిబ్యూట‌ర్ చేతిలో ప‌డితే రిలీజ్ స‌వ్యంగా సాగుతుంది. లేదంటే పెట్టిన పెట్టుబ‌డి కూడా వృధా అవుతుంది. సొంత‌ రిలీజ్ చేయాల‌ని ఆత్ర ప‌డితే థియేట‌ర్ ఓన‌ర్ కి ఎదురు డ‌బ్బులిచ్చి రిలీజ్ చేయాలి. మంచి టాక్ వ‌స్తే సేఫ్ జోన్ లోకి వ‌స్తుంది. లేదంటే ఆ నిర్మాత రోడ్డున ప‌డాల్సిందే. అయితే తాజా థియేట‌ర్ మాఫియా ... ఆ న‌లుగురికి చెక్ పెట్టేందుకేనా? అన్న‌ది కూడా చూడాలి. ఒక నాయ‌కుడిని తెర‌పైకి తెచ్చి ఇప్ప‌టికే సింగిల్ స్క్రీన్ల‌పై క‌ర్చీఫ్ వేసిన బ‌డా నిర్మాత‌ల‌ సిండికేట్ ఈ ఆట ఆడుతోందా? అన్న‌ది కూడా కాస్త క్లారిటీగా తెలియాల్సి ఉందింకా.
Tags:    

Similar News