కమెడియన్ - కార్టూనిస్టుపై కోర్టు ధిక్కార కేసులు..జడ్జీలపై ఘాటు వ్యాఖ్యలే కారణం
సుప్రీంకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ కమెడియన్ కునాల్ కామ్రా, కార్టూనిస్టు రచితా తనేజాలకు కోర్టు ధిక్కార నోటీసులు అందాయి. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కునాల్, రచితా జడ్జీలపై అభ్యంతరకర ట్వీట్లు పెట్టారు. అయితే వీరి ట్వీట్లపై కోర్టు ఉల్లంఘన కేసు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ విద్యార్థి స్కంద్ బాజ్ పాయ్ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరారు.
వారి ట్వీట్లను పరిశీలించిన అటార్నీ జనరల్ అందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా వారిద్దరికీ షోకాజు నోటీసులు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అయితే ఎవరైనా ఓ వ్యక్తిపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాలంటే చాలా తతంగం ఉంటుంది. కోర్టు కాంటంప్ట్ యాక్ట్ -1971 లోని సెక్షన్ 15 కింద అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ సమ్మతిని పొందాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియ సాగింది. అయితే ఇప్పుడు కునాల్ కామ్రా, కార్టూనిస్టు మాత్రం ఈ నోటీసుల పట్ల భిన్నంగా స్పందించారు. జడ్జీలపై చేసిన వ్యాఖ్యలకు తాము కట్టుబడి ఉన్నామని వాళ్లు చెప్పారు.
మేము సుప్రీంకోర్టు జడ్జీలకు సారీ చెప్పబోమని స్పష్టం చేశారు. కోర్టు తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్నాబ్ కు బెయిల్ విషయంలో కోర్టు నిష్పక్షపాతంగా వ్యవహరించ లేదని ఆరోపణలు చేయగా, సుప్రీంకోర్టు బీజేపీకి మేలు చేసింది అనే ఉద్దేశంతో అర్థం వచ్చేలా రచిత తనేజా ట్వీట్ చేసింది. ఆర్నాబ్ తండ్రి ఎవరో తెలుసా.. అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నిస్తూ రచిత ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై విమర్శలు రావడంతో ఆమెపై కేసు నమోదైంది.