స్టార్ హోదాలో ఉండి మెగాస్టార్ బాధపడిన సందర్భం.. అదేనట!

Update: 2020-04-20 23:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల ప్రస్థానం కలిగినా కూడా ఇప్పటికి ఎక్కడా ఎప్పుడు తన హుందాను, గర్వాన్ని ప్రదర్శించకుండా ఉండే సింపుల్ మనిషి. అరవై ఏళ్ళ పైబడిన వయసులోనూ నిత్యం సినీ అభిమానులను అలరిస్తున్న తీరు ఎందరో స్టార్స్ కి స్ఫూర్తిదాయకం. ఈ విషయాన్నీ పలు సందర్భాలలో స్టార్స్ ఓపెన్ గా చెప్పడం విశేషం. అలాంటిది ఒక స్టార్ స్టేటస్ వచ్చాక చిరంజీవిని బాధ పెట్టిన ఓ సినిమా ఉందట. 1986లో స్వాతిముత్యం విడుదలై బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుంది. కమర్షియల్ సినిమాకు ధీటుగా విడుదలైన అన్నీ కేంద్రాల్లో వందరోజులు ఆడింది.

అందులో కమల్ హాసన్ నటన గురించి మాట్లాడుకోని ప్రేక్షకుడు లేరు. దాని గురించి విన్న చిరంజీవి స్వాతిముత్యంని ప్రత్యేకంగా చూశారట. అంతే ఒక్కసారిగా నిరాశ చెండాడట. సుప్రీమ్ హీరో, డైనమిక్ స్టార్ అనిపించుకుంటున్నాం మనకేం తక్కువ అనుకుంటున్న టైంలో స్వాతి ముత్యంలో కమల్ విశ్వరూపం చూసి తానెం కోల్పోతున్నారో చిరుకి అర్థమయ్యింది. ఇలాంటి పాత్ర నాకు రాలేదే, ఇంత గొప్పగా పర్ఫార్మ్ చేసే సబ్జెక్టు నాకు దొరుకుతుందా అని ఓ రెండు మూడు రోజులు తెగ మధన పడ్డారట.

అదే సమయంలో చిరుతో పాటు నటిస్తున్న హీరోయిన్ సుహాసిని.. చిరు డల్ గా ఉండటానికి కారణం తెలుసుకుందట. గొప్ప నటులకు టైం వచ్చినప్పుడు అలాంటి కథ ప్రతీ ఒక్కరికి వస్తుందని చెప్పి దర్శకుడు విశ్వనాథ్ తో కమల్ కి చేరవేశారు. ఇందులో ఓ ముచ్చటని చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. సుహాసిని గారు చిరంజీవి బాధను విశ్వనాధ్ గారికి చెప్పడం.. అటు తరువాత ఆయన మెగాస్టార్ తో 'స్వయంకృషి' చిత్రం చేయడంతో.. ఆ లోటు తీరిందట. అందులో అద్భుతమైన నటనను కనబరిచి మెగాస్టార్.. స్టార్ గా మరో మెట్టు ఎక్కారు.
Tags:    

Similar News