ఖైదీ ఉండాల్సిందే అంటున్న చిరు

Update: 2015-10-06 12:04 GMT
సినీ రంగంలో సెంటిమెంట్ లకు ఎవ్వరూ అతీతులు కారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు అతీతుడేమీ కాదు. తన సినిమా టైటిల్ లో ‘ఖైదీ’ అనే పదం ఉంటే ఆ సినిమా సూపర్ హిట్టే అన్న సెంటిమెంటుతో తన 150వ సినిమా టైటిల్ విషయంలో ‘ఖైదీ’ అనే పదం చేర్చమని అంటున్నాడట చిరు. ‘ఖైదీ’ సినిమా చిరు కెరీర్ ను ఎలా మలుపు తిప్పిందో తెలిసిన విషయమే. ఆ తర్వాత ఖైదీ నెం.786 కూడా పెద్ద హిట్టే అయింది.

చిరు ప్రస్తుతం తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ని రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోది ద్విపాత్రాభినయం. ఓ పాత్ర జైలు నుంచి తప్పించుకుని బయటికి వస్తుంది. కాబట్టి ఖైదీ అనే పదం పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి టైటిల్ లో ‘ఖైదీ’ వచ్చేలా చూడాలని వినాయక్ కు సూచించాడట చిరు. ప్రస్తుతం వినాయక్ అండ్ టీమ్ స్క్రిప్టును పక్కాగా రెడీ చేసే పనిలో ఉన్నారు.

ఇంకో వారం పది రోజుల్లో చిరంజీవి రీఎంట్రీ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఆ సందర్భంగానే సినిమా టైటిల్ కూడా ప్రకటించబోతున్నారు. తన కొడుకు రామ్ చరణ్  తన రీఎంట్రీ మూవీ గురించి ప్రకటన చేస్తాడని చిరంజీవి ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశముంది.
Tags:    

Similar News