• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ ను మిస్ అవుతున్న...

చరణ్ ను మిస్ అవుతున్న చిరు..!

By - Tupaki Desk
Update: 2023-01-12 05:46 GMT
మెగాస్టార్ చిరంజీవి, మెగా వారసుడు రామ్ చరణ్ ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంతగా బిజీగా ఉన్నారు అంటే కనీసం తండ్రీకొడుకులు కలుసుకోలేనంత బిజీగా ఉన్నారు. ఇద్దరు ఉండేది హైదరాబాద్ లోనే కానీ కలిసి చాలా రోజులైంది. ఈ విషయాన్నే చిరంజీవి రీసెంట్ వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కాస్త బాధగా చెప్పారు. చరణ్ ను మిస్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

చరణ్ జపాన్ వెళ్లాడు.. వెళ్లే ముందు కలవడం కుదరలేదు.. అటు నుంచే టాంజానియా వెళ్లాడు. రాగానే 2 రోజులు మాత్రమే హైదరాబాద్ లో ఉండి న్యూజిల్యాండ్ షూటింగ్ కి వెళ్లాడు. మళ్లీ వచ్చి మరో రెండు రోజులు ఆగి అమెరికా వెళ్లాడు. న్యూజిల్యాండ్ వెళ్లొచ్చిన తర్వాత చరణ్ ఇంటికి వస్తే తాను ఇంట్లో లేను.. అలా చరణ్ కలిసి చాలా రోజులైంది అంటూ తండ్రిగా తన బాధను వ్యక్తం చేశారు చిరు.

హైదరాబాద్ లో ఉన్నా సరే ఇద్దరం రెగ్యులర్ గా కలవడం కుదరట్లేదని. చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు తను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానో.. ఇప్పుడు అది మళ్లీ రిపీట్ అయ్యిందని అన్నారు చిరు. చరణ్ చిన్నప్పుడు షూటింగ్స్ బిజీ వల్ల అసలు కలవలేకపోయే వాడిని.. ఉదయాన్నే వెళ్లి రాత్రి వచ్చే వాడిని..

తన వైఫ్ పదే పదే కలవమని చెబుతున్నా నిద్రపోతున్న చరణ్ ను ఓ ముద్దు పెట్టి వెళ్లిపోయే వాడిని.. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది అని అన్నారు చిరు. నేను తను బిజీ అవడం వల్ల కలవడం కుదరట్లేదని అన్నారు మెగాస్టార్.

ఇక మీదట ఆ పరిస్థితి ఉండదని.. తన ఇంట్లోనే ఒక పోర్షన్ చరణ్ కోసం సిద్ధం చేశానని.. మరికొద్ది రోజుల్లో ఉపాసన తో కలిసి చరణ్ తన ఇంటికి వచ్చేస్తారని అన్నారు. ఇకమీదట చరణ్ తనతోనే ఉంటాడని.. షూటింగ్ లేని టైం లో అందరం కలిసి లంచ్ చేస్తామని ఫ్యామిలీ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు చిరంజీవి.

తండ్రికి తగ్గ తనయుడిగా రాం చరణ్ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాల్లో చరణ్ నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilmIndustry 
  • MegaFamily 
  • MegastarChiranjeevi 
  • RamCharan 
  • ChiranjeeviMissingCharan 
  • RRRMovie 
  • WaltairVeerayya 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS