ఈ టైంలో వినాయక్‌ అంత పిచ్చి పొరపాటు చేయడు

Update: 2020-11-13 02:55 GMT
మలయాళ హిట్‌ మూవీ లూసీఫర్‌ ను తెలుగులో రీమేక్‌ చేయాలని మెగా కాంపౌడ్‌ బలంగా కోరుకుంటుంది. చిరంజీవి కమర్షియల్‌ మూవీగా లూసీఫర్‌ ను చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం స్ర్కిప్ట్‌ రెడీ చేయడంలో సుజీత్‌ విఫలం అవ్వడంతో ఆ బాధ్యతను వివి వినాయక్‌ కు అప్పగించాడు. మూడు నెలల పాటు పలువురు రచయితలు మరియు దర్శకులు కలిసి వినాయక్‌ ఆధ్వర్యంలో రెడీ చేసిన స్క్రిప్ట్‌ విషయంలో కూడా చిరు చరణ్‌ లు పెదవి విరిచారు అంటూ పుకార్లు వచ్చాయి. స్క్రిప్ట్‌ నచ్చక పోవడంతో లూసీఫర్‌ రీమేక్‌ నుండి వినాయక్‌ తప్పుకోవాలని భావించాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. కాని అవి ఒట్టి పుకార్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వినాయక్‌ ముందు ఈ ఆప్షన్‌ తప్ప వెంటనే పెద్దగా వేరే ఏమీ ఉన్నట్లుగా లేవు.

ఏ దర్శకుడు అయినా చిరంజీవితో సినిమా చేయాలని కోరుకుంటాడు. అలాంటిది వినాయక్‌ కు వచ్చిన అవకాశం ఆయన చేజేతులా ఎలా వదులుకుంటాడు. అయినా వినాయక్‌ అంత పిచ్చి పొరపాటు చేయడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఒక నెల కాకుంటే మరో నెల లేదంటే రెండు మూడు నెలలు కూడా మళ్లీ కూర్చుని స్క్రిప్ట్‌ రెడీ చేసుకుంటాడు. ఆ తర్వాత అయినా చిరంజీవిని ఒప్పిస్తాడు. తాను కాకుంటే పరుచూరి బ్రదర్స్‌ వంటి ప్రముఖ రచయితల సాహకారం తీసుకుని స్ర్కిప్ట్‌ ను రెడీ చేస్తాడు. అంతే తప్ప వచ్చిన మెగా ఆఫర్‌ ను వినాయక్‌ వదిలి పెట్టడు. ఆచార్య సినిమా తర్వాత వేదాళం చేయబోతున్న చిరంజీవి ఖచ్చితంగా ఆ తర్వాత చేయబోతున్న మూవీ 'లూసీఫర్‌' అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అది కూడా వినాయక్‌ దర్శకత్వంలోనే అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
Tags:    

Similar News