ఒక్క ఐడియాతో మెగాస్టార్ నే పడేశాడా?
ఇటీవలి కాలంలో ఆఫర్ రావడం అన్నది అంత సులువుగా ఏమీ లేదు. హీరోల్ని ఒప్పించాలంటే దర్శకులకు అంత ఈజీగా సాధ్యపడడం లేదు. వండర్ ఫుల్ అనదగ్గ కథని చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. పైగా స్క్రీన్ ప్లే సహా సన్నివేశాలు వండి బౌండ్ స్క్రిప్టుతో వచ్చాకే ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు. అలా వచ్చాకా తిరస్కారానికి గురైన సందర్భాలు కోకొల్లలు. అగ్ర హీరోలైనా.. యువహీరోలైనా స్క్రిప్టు- దర్శకుడి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒప్పించేయడం అన్నది బిగ్ టాస్క్ గా మారింది.
దర్శకుడి గత ట్రాక్ రికార్డ్ సహా ప్రతిదీ మన హీరోలు చూస్తున్నారు. అయితే ఇలాంటి వాటితో పనే లేకుండా డిజాస్టర్లు తీసిన ఓ దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇవ్వడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొంతకాలంగా మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్ గురించి టాలీవుడ్ లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని.. చరణ్ స్వయంగా నిర్మిస్తారని ప్రచారమైంది. పలువురు దర్శకులు రీమేక్ స్క్రిప్టు రాసే పనిలో బిజీగా ఉన్నారన్న కథనాలు వెలువడ్డాయి.
అయితే అంతిమంగా .. ఈ ప్రాజెక్ట్ ను దర్శకుడు బాబీకి కొణిదెల కాంపౌండ్ కట్టబెట్టనుందని తెలుస్తోంది. బాబీ ఇప్పటికే ఓ థీమ్ లైన్ ని వినిపించాడు. రీమేక్ కథే అయినా తెలుగైజ్ చేసేందుకు ఉన్న ఆస్కారమేమిటో కూడా బాబీ క్లియర్ కట్ గా మెగాస్టార్ కి వివరించి చెప్పారట. దీంతో చిరు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే లూసీఫర్ రీమేక్ ఫైనల్ స్క్రిప్టు వచ్చాకే ఏదైనా ఖాయం అవుతుందిట. ఇటీవలి కాలంలో పవన్ హీరోగా సర్ధార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ తీసిన బాబీ వెంకీ-చైతూ హీరోలుగా వెంకీ మామ లాంటి యావరేజ్ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తమ్ముడికి అంత పెద్ద డిజాస్టర్ ని ఇచ్చినా చిరు ఇప్పుడు బాబీకి అవకాశం ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్- పవన్- వెంకీ-చైతన్య లాంటి హీరోల తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం బాబీకి దక్కినట్టేనా? అంటే ఇప్పటికి ఇంకా సస్పెన్స్. ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో ఆచార్య సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కల్లోలం షూటింగులపై బిగ్ పంచ్ వేసింది. లాక్ డౌన్ సన్నివేశం ప్రాజెక్టులకు పెద్ద అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే.