విలక్షణ నటుడికి 'ఆచార్య' అభినందనలు..!

Update: 2021-04-12 10:30 GMT
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎటువంటి పాత్ర అయినా పాణం పెట్టి చేయగలిగే నటుడు ఎవరంటే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ శాండిల్ వుడ్ సహా అన్ని ఇండస్ట్రీలలో తన సత్తా చాటాడు. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులను దక్కించుకున్న ప్రకాశ్ రాజ్‌.. నటుడిగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు. అయితే మల్టీటాలెంటెడ్ అనిపించుకున్న ప్రకాశ్ రాజ్ నటనకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫిదా అయ్యారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' లో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. కోర్టులో పవన్ కు ధీటుగా నిలబడే ప్రతివాద లాయర్ గా అదరగొట్టాడు. కొన్ని సన్నివేశాలు కేవలం ప్రకాష్ రాజ్ వల్లనే బలంగా కుదిరాయని చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా చూసిన చిరంజీవి.. ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ప్రకాష్ ను కొనియాడిన చిరు.. ఇప్పుడు ఆయనను స్వయంగా కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ఈ విషయాన్ని చిరు వెల్లడిస్తూ.. ప్రకాష్ రాజ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

''ప్రకాష్ రాజ్ లాంటి క్యాలిబర్ ఉన్న నటుడు మీతో ఉన్నప్పుడు.. అది తోటి కళాకారుల నటనను కూడా మెరుగుపరుస్తుంది. వకీల్‌ సాబ్‌ లో అతని నటన ఖచ్చితంగా అద్భుతంగా ఉంది. అతను పవన్ కళ్యాణ్‌ కి గొప్ప కౌంటర్ పార్ట్ ఇచ్చాడు. మీకు ప్రత్యేక అభినందనలు. కీప్ రాకింగ్ ప్రకాష్!'' అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News