ఫస్ట్ టైం కాజల్ కే ఆ ఎక్స్ పీరియన్స్..

Update: 2017-01-10 05:25 GMT
ఖైదీ నంబరు 150 సినిమా విడుదల సమయం గంటల్లోకి వచ్చేసింది. మీరీ కథనాన్ని చదివే సమయానికి మహా అయితే.. పన్నెండు.. పద్నాలుగు గంటల సమయం మాత్రమే సినిమా విడుదలకు ఉంటుందేమో. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్ మినహా.. మిగిలిన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖైదీ సినిమా ఫ్యాన్స్ షోలు ఈ రోజు అర్థరాత్రి నుంచి షురూ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఖైదీ సినిమా ప్రచార జోరును మరింత పెంచేసే పనిలో బిజీగా ఉన్న మెగాస్టార్.. తన సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర ముచ్చటను చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ సినిమా ఇండస్ట్రీలో జరగనిది ఒకటి కాజల్ విషయం జరిగిందని చెప్పారు చిరు. మగధీర చిత్రంలో చరణ్ తో జత కట్టిన కాజల్.. తర్వాత తనతో జత కట్టటం బాగుందన్న ఆయన.. మొదట కొడుకుతో జత కట్టి.. తర్వాత తండ్రితో జత కట్టిన హీరోయిన్ ఎక్కడా లేరని.. ఇది కాజల్ విషయంలోనే ఫస్ట్ జరిగిందని చెప్పుకొచ్చారు.

తమ జోడీపై జనాల్లోనూ పాజిటివ్ స్పందన ఉందని.. తమ ఇద్దరి జోడీపై విడుదల చేసిన స్టిల్స్ చూసి అందరూ మెచ్చుకుంటున్నట్లుగా చిరు చెప్పారు. నిజమే.. తమ్ముడి కూతురుగా (చందమామ) యాక్ట్ చేసిన నటితో.. అన్నతో జత కట్టటం కూడా కాజల్ కు మాత్రమే దక్కిన ఛాన్స్ గా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News