తలసాని సేవా ప్రోగ్రాంకు చిరంజీవి ఎందుకు రాలేదంటే?

Update: 2020-05-28 17:30 GMT
మహమ్మారి వైరస్ ధాటితో లాక్ డౌన్ ఏర్పడి సినీ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. వారికి చిరంజీవి సారథ్యంలో సినీ ప్రముఖులంతా కలిసి ఇప్పటికే నిత్యావసరాలు, డబ్బులు పంపిణీ చేశారు. తాజాగా సినీ కార్మికులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అండగా నిలిచారు. ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు ‘తలసాని ట్రస్ట్’ ద్వారా నిత్యావసరాలు సాయం అందించారు. ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనీ ప్రముఖులంతా హాజరయ్యారు. కానీ ఇండస్ట్రీ పెద్ద అయిన చిరంజీవి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

తలసాని అందించే నిత్యావసరాల బ్యాగ్ పై కేసీఆర్, కేటీఆర్, తలసాని బొమ్మలతోపాటు చిరంజీవి బొమ్మను కూడా ముద్రించారు. అలాంటిది చిరు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు లాంటి సినీ కార్మికులకు సరుకులు అందించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కాకపోవడంపై చిరంజీవి వివరణ ఇచ్చారు.

తలసాని సేవా ట్రస్ట్ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోవడానికి కారణాన్ని చిరంజీవి వెల్లడించారు. తన కోడలు ఉపాసన తాత కామినేని ఉమాపతి రావు మృతి చెందిన కారణంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని.. అందుకే రాలేదని చిరంజీవి తెలిపారు. మంత్రి తలసాని సాయానికి .. ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఇంత గొప్ప సేవ సినీ కార్మికులకు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Tags:    

Similar News