వైజాగ్ లో నాకు స్థలం చూసి పెట్టరూ-చిరు
విశాఖపట్నంతో తనకున్నది మామూలు అనుబంధం కాదన్నాడు మెగాస్టార్ చిరంజీవి. వైజాగ్ లో నిర్వహించడమే ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ మీట్ కు రావడానికి తాను అంగీకరించడానికి ముఖ్య కారణాల్లో ఒకటని చిరు అన్నాడు. తనకు రిటైర్మెంట్ అంటూ ఉంటే.. వైజాగ్ లోనే వచ్చి స్థిరపడాలని.. ఇక్కడి స్థానికుల్లో ఒకడిగా బతకాలని తనకు కోరిక అని అన్నాడు చిరు. ఇంకా విశాఖపట్నం గురించి చిరు ఏమన్నాడంటే...
‘‘విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చినా సరే నాకు ఒక పులకింత కలుగుతుంది. వైబ్రేట్ అవుతుంటాను. నాకీ నగరంలో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి ప్రజలు నాకు ఆత్మీయులు. నేను సినిమాల పరంగా కానీ.. రాజకీయాల విషయంలో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పర్యటించిన నగరం. ఈ సిటీని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇక్కడే ‘అభిలాష’ కోసం యురేకా సకా మికా పాటకు డ్యాన్సులేశా.. ఇందువదన కుందవదన అంటూ ‘ఛాలెంజ్’ సినిమాలో డ్యాన్సులు చేశా.. ఇక్కడి పోర్టులోనే మాస్ జనాల్ని ఉర్రూతలూగించిన ‘బంగారు కోడిపెట్ట’ పాట చేశాం. ఇంకా చంటబ్బాయి.. ఆరాధన.. శుభలేఖ.. ఇలా ఎన్నో సినిమాలు చేశాను.
విశాఖకు ఎప్పుడొచ్చినా ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. నాకు రిటైర్మెంట్ అంటూ ఉంటే ఇక్కడే స్థిరపడాలన్నది నా కోరిక. మీతో పాటు నేను కూడా ఓ స్థానికుడిలా బతకాలనుకుంటున్నాను. వీలైతే నా కోసం చిన్న స్థలం చూసి పెట్టండి. ఇప్పుడు వేసవితో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కానీ వైజాగ్ లో మాత్రం ఆ వేడి కనిపించదు. మండు వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఆ చల్లదనం వాతావరణంలోంచి వచ్చింది కాదు.. మీ మనసుల్లోంచి వచ్చింది’’ అంటూ విశాఖ వాసుల్ని ఉర్రూతలూగించే మాటలు చెప్పాడు చిరు.