పవన్ సినిమాలకు బ్రేక్.. ఇప్పట్లో షూటింగ్ కష్టమేనట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కరోనా నుండి కోలుకొని విశ్రాంతిలో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్.. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్స్ నిలుపుకొని పవన్ గురించి వెయిట్ చేస్తున్నాయి. పవన్ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటే అప్పుడే సినిమాలు మొదలవుతాయి. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడాల్సి ఉండగా.. వైద్యులు పూర్తిగా రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తుంది. అందుకే పవన్ ఇప్పట్లో ఏ సినిమా షూటింగ్ చేసే ఆలోచనలో లేడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యంతో పాటు పవన్ తన ఫిట్నెస్ పై కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా హిస్టోరికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందులో యుద్ధ సన్నివేశాలు, భారీ ఫైట్స్ ఉంటాయి. అందుకోసమైనా పవన్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఈ లెక్కన హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ రెండు సినిమాలు కూడా ఇప్పట్లో షూటింగ్ ప్రారంభించడం కష్టమే. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పవన్ త్వరగా కోలుకొని సినిమాలు ప్రారంభం చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు. వీరమల్లు సినిమాను క్రిష్ తెరకెక్కిస్తుండగా.. ఏకే మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. చూడాలి మరి మళ్లీ పవన్ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటాడో!