చిరంజీవితో బోయపాటి... అదిరిపోయే కాంబో....?

Update: 2021-12-07 04:30 GMT
బోయపాటి శ్రీను.. ఊర మాస్ లెక్కలే. ఫస్ట్ మూవీ భద్రతో మొదలెట్టి తులసీతో రెట్టించి సింహాతో రీ సౌండ్ చేసిన మొనగాడు డైరెక్టర్. ఇక బాలయ్యకు లెజెండ్ తో పాటు లేటెస్ట్ గా అఖండమైన హిట్ ఇచ్చిన బోయపాటి టాలీవుడ్ లో టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యలో జయ జానకీ రామా. వినయ విధేయ రామా అంటూ సాఫ్ట్ టైటిల్స్ తో కాస్తా పక్కకు జరిగినా అల్లు అర్జున్ తో సరైనోడు వంటి సక్సెస్ కొట్టి తాను తగ్గేదిలే అనిపించుకున్నాడు.

మొత్తానికి బోయపాటికి మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయి. అఖండతో ఆయన లైమ్ లైట్ లోకి వచ్చారు. మెగా పవర్ స్టార్ తో 2019 సంక్రాంతికి హిట్ కొట్టలేక కాస్తా ఇబ్బంది పడినా తన స్టామినా రేంజి ఏంటో అఖండతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అప్పట్లోనే బోయపాటితో మెగాస్టార్ మూవీ ఉంటుందని వినిపించినా వినయ విధేయ రామాతో కొంత బ్రేక్ పడింది.

ఇపుడు మళ్ళీ బోయపాటి చుట్టూ టాలీవుడ్ తిరుగుతోంది. చెప్పిన మాట మేరకు బ్లాక్ బస్టర్ ఇచ్చి అటు బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా ఇటు టాలీవుడ్ కి కూడా సరికొత్త  పండుగ తెచ్చిన బోయపాటి అన్ స్టాపబుల్ అంటున్నారు.

వరసబెట్టి క్రేజీ కాంబినేషన్స్ తో ఆయన తరువాత సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో  ముందుకు వచ్చిన న్యూసే మెగాస్టార్ తో కాంబో. బోయపాటి లోని ఊర మాస్ టాలెంట్ కి ఏనాడో మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఇపుడు ఆయన కూడా చకచకా సినిమాలు చేస్తున్నారు. పైగా గతంలో తాను చేయని డైరెక్టర్లతో మూవీస్ చేస్తున్నారు.

ఇపుడు సడెన్ గా బోయపాటి కూడా లైన్ లోకి వచ్చాడు. మెగా కాంబోలో బోయపాటి మూవీ అంటే ఆ రేంజే వేరే లెవెల్ లో ఉంటుంది అంటున్నారు. బోయపాటి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మాస్ కి కిక్కెక్కించే డైలాగులు, ఒకటి రెండూ కాదు ప్రతీ సీన్ ని క్లైమాక్స్ లెవెల్ లో ఎలివేట్ చేసే టెక్నిక్ ఇవన్నీ కూడా మెగాస్టార్ తో ఒకటి పది రెట్లు బాగా పండుతాయని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.

అన్నీ కుదిరితే చాలా తొందరలోనే ఈ కాంబోకి సంబంధించి కీలకమైన ప్రకటన వస్తుంది అంటున్నారు. మొత్తానికి బోయపాటి అల్లు అర్జున్, మెగాస్టార్ తో పాటు టాప్ స్టార్స్ అందరితోనూ చకచకా  మూవీస్ చేసేటట్టే ఉన్నాడు. ఆ లిస్ట్ ముందో తరువాతో బాలయ్యతో కూడా మరో మూవీ ఉంటుందిట. ఇలా వీరిద్దరి కలయికలో  సెకండ్ హ్యాట్రిక్ కి బీజం వేయాలని బోయపాటి ఆలోచిస్తున్నారు అంటున్నారు. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News