'ఎటాక్' టీజర్: జాన్ అబ్రహాం - రకుల్ కలిసి చేసిన భారీ యాక్షన్ డ్రామా..!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులోనే కాకుండా.. తమిళ హిందీలోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో రకుల్ సనటించిన హిందీ సినిమా '‘ఎటాక్''.
లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా పడింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో మేకర్స్ ''ఎటాక్'' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసారు. రిపబ్లిక్ డే సందర్భంగా 2022 జనవరి 28న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఓ ఎయిర్ పోర్ట్ లో బాబ్ బ్లాస్టింగ్ దుర్ఘటన జరగడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. పేలుడు జరిగిన ప్రదేశంలో జాన్ ఏడుస్తూ కనిపించగా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ షాక్ కు గురై ఆందోళనగా చేస్తూ ఉంది.
ఈ క్రమంలో శత్రువులను పట్టుకోడానికి జాన్ అబ్రహం ఒక లీన్ మీన్ కిల్లింగ్ మెషీన్ గా సూపర్ కమాండోగా కనిపించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా భాగం కల్పించారు. జాక్వెలిన్ ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ - రత్న పాఠక్ షా కీలక పాత్రలు పోషించారు.
భవిష్యత్ లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని యుద్ధాలు ఎలా జరుగుతాయి? వాటిని ఎదుర్కోడానికి ఎలా సిద్ధపడాలనే కాన్సెప్ట్ 'ఎటాక్' సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.
భారీ యాక్షన్ సీన్స్ తో వచ్చిన 'ఎటాక్' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ''భవిష్యత్తులో యుద్ధాలు సాంకేతికత ఆధారంగా జరగనున్నాయి. తీవ్రవాద దాడులను ఎదుర్కోవడానికి భారతదేశం స్వంత కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) గల సూపర్ సైనికుడిని తయారు చేస్తుంది.
తన దేశానికి సేవ చేయడం కోసం తనకు ప్రియమైన వారిని జీవితాన్ని పణంగా పెట్టి.. ఎలా పోరాడాడు? అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? అనేది ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో చూడొచ్చు'' అని 'ఎటాక్' సినిమా గురించి చిత్ర బృందం వివరించింది.
'ఎటాక్' చిత్రాన్ని జెఎ ఎంటర్టైన్మెంట్స్ - పెన్ స్టూడియోస్ - అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జాన్ అబ్రహాం - జయంతి లాల్ గడ - అజయ్ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జాన్ అబ్రహం కథ అందించడం విశేషం.
శాశ్వత్ సచ్ దేవ్ దీనికి సంగీతం సమకూర్చగా.. విల్ హంఫ్రిస్ - P.S.వినోద్- సౌమిక్ ముఖర్జీ సినిమాటోగ్రఫీ అందించారు. 'ఎటాక్' సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కు మరియు 'సత్యమేయ జయతే 2' తో ప్లాప్ అందుకున్న జాన్ అబ్రహం కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Full View