బాలీవుడ్ లో మోత మోగించనున్న ఇస్మార్ట్ సినిమా..

Update: 2020-04-27 08:50 GMT
తెలుగు సినిమాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎక్కువగా ముందుకొస్తున్నారు. ఈ మధ్య వచ్చిన ప్రతీ తెలుగు సినిమాపై బాలీవుడ్ నిర్మాతలు కన్నేస్తున్నారు. సినిమా బాగా ఆడిందంటే మరో మాట ఆలోచించకుండా రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. బాహుబలి ద్వారా బాలీవుడ్ లో దుమ్మురేపడంతో ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అప్పటి హలో బ్రదర్ నుండి మొన్నటి అర్జున్ రెడ్డి వరకు ఎన్ని విజయాలు నమోదు అయ్యాయో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం మరో సినిమా బాలీవుడ్ లోకి వెళ్ళనుందట. డాషింగ్ డైరెక్టర్ పురి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారట.

ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపింది. మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన పూరి మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి పనైపోయింది అనుకున్న వారికి ఇస్మార్ట్ విజయం ద్వారా తానేంటో చెప్పాడు. ఈ సినిమాలో రామ్ నటనకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. మాస్ లుక్ లో రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో హీరోగా రణ్ బీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ హీరో రణ్ బీర్ కపూర్ అయితే దర్శక నిర్మాతలు ఎవరనేది ఇంకా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ మాస్ లుక్కులో బాలీవుడ్ జనాల్ని ఆకట్టుకుంటాడా లేదా చూడాలి. మరి ఈ రెండు రీమేక్ ఉంటుందా? లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..
Tags:    

Similar News