• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ కేసు :...

డ్రగ్స్ కేసు : హీరోయిన్లేనా? హీరోలు కూడా ఉన్నారా?

By - Tupaki Desk
Update: 2020-09-23 17:36 GMT
సినీ ఇండస్ట్రీలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లు రోజుకో మలుపు తిరుగుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముందుగా బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ మాఫియా బాంబ్ ప్రకంపనలు ఆ తర్వాత శాండిల్ వుడ్‌ కు ఇప్పుడు టాలీవుడ్ కూ పాకాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని మరియు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసింది. మరోవైపు శాండిల్‌ వుడ్‌ డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రాగిణి ద్వివేది - సంజన గల్రానీలతో పాటు పలువురిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్స్ అరెస్ట్ అయ్యారు.

కాగా, రియా చక్రవర్తిని విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పలువురు సినీ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దీపికా పదుకొనే - సారా అలీఖాన్‌ - శ్రద్ధా కపూర్‌ - రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లకు డ్రగ్ వ్యవహారంలో లింకులు ఉన్నాయని టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ దీపికా - శ్రద్ధా - సారా - రకుల్‌ లకు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. వీరిని రాబోయే మూడు రోజుల్లోగా ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్లను అరెస్ట్ చేయడంతో పాటు నలుగురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసినట్లయింది. దీంతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లే డ్రగ్స్ తీసుకుంటారా? హీరోల్లో డ్రగ్స్ వాడేవారు.. డ్రగ్ బానిసలు లేరా? వారిపై డ్రగ్ ఆరోపణలు లేవా? హీరోలకు డ్రగ్ మాఫియాతో లింకులు లేవా? లాంటి ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.

ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోలు ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపిస్తూ ఈ కేసులో రియాను బలిపశువును చేశారని పేర్కొంది. అలానే బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే తీసుకుంటారని డర్టీ సీక్రెట్స్ బయటపెట్టింది. బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్ - రణవీర్ సింగ్ - విక్కీ కౌశల్ వంటి వారు డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తనతో ఒకప్పుడు ఎఫైర్ సాగించిన స్టార్ హీరో కూడా డ్రగ్ అడిక్ట్ అని సంచలన ఆరోపణలు చేసింది కంగనా. అయినా ఇంత వరకు డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్స్ పేర్లే బయటకు వస్తుండగా.. ఒక్క హీరో పేరు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో హీరోల పేర్లు డ్రగ్స్ కేసులో దొరకలేదా? లేదా హీరోయిన్స్ కి బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లనే వారి పేర్లు బయటకు వస్తున్నాయా? లేక నెక్స్ట్ జాబితాలో హీరోల పేర్లు కూడా ఉండబోతున్నాయా? అనే ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ఏదేమైనా సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం అన్ని వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS