• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజు ఒత్తిడితో...

దిల్ రాజు ఒత్తిడితో బింబిసార వర్సెస్‌ కార్తికేయ 2?

By - Tupaki Desk
Update: 2022-07-03 13:30 GMT
నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సీక్వెల్‌ గా కార్తికేయ 2 తెరకెక్కింది. సహజంగానే సూపర్‌ హిట్‌ సినిమా సీక్వెల్‌ పై అంచనాలు భారీగా ఉంటాయి. కార్తికేయ 2 సినిమా విషయంలో ఆ అంచనాలు ఒకింత ఎక్కువే ఉన్నాయి. కార్తికేయ 2 నుండి ఇటీవల విడుదల అయిన ఫస్ట్‌ లుక్ మరియు ప్రమోషనల్‌ వీడియోలు సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి.

కార్తికేయ 2 ను జూలై 22న విడుదల చేయబోతున్నట్లు చాలా వారాల క్రితమే యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. కాని అదే జూలై 22 వ తారీకున నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడి విడుదలకు సిద్దం అయిన థాంక్యూ సినిమా ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదంటూ నిర్మాత దిల్‌ రాజు భీష్మించుకు కూర్చున్నాడు.

అదే సమయంలో సోలో రిలీజ్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. థాంక్యూ సినిమా సోలో రిలీజ్ కోసం కార్తికేయ 2 ను వాయిదా వేసుకోవాల్సిందిగా మేకర్స్ కు దిల్ రాజు సూచించడంతో పాటు ఒకింత ఒత్తిడి తెస్తున్నాడనే చెప్పాలి. కార్తికేయ 2 సినిమా తప్పని పరిస్థితుల్లో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక వేళ జూలై 22న కనుక కార్తికేయ 2 విడుదల కాకుంటే ఆగస్టు 5కు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ రోజున నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన బింబిసారా విడుదలకు సిద్దంగా ఉంది. బింబిసార సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాకు కార్తికేయ పోటీ అంటే ఖచ్చితంగా నష్టం తప్పదు. దాంతో ఇప్పుడు బింబిసారా మేకర్స్‌ కార్తికేయ 2 ను చూసి ఆందోళన చెందుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొత్తానికి కార్తికేయ 2 సినిమా పై పాజిటివ్ బజ్ ఉండటంతో పాటు దర్శకుడు చందు మొండేటి ఈ సినిమా ను అద్భుతంగా తెరకెక్కించాడనే అభిప్రాయంతో ఎక్కువ శాతం ఉండటం వల్ల ఈ సినిమా కు పోటీ గా ఉండదని.. లేదంటే తమ సినిమాలకు ఈ సినిమా పోటీ అవ్వద్దని ఫిల్మ్‌ మేకర్స్ భావిస్తున్నారు. కార్తికేయ 2 కు వచ్చిన పాజిటివ్‌ బజ్‌ నేపథ్యంలో ఇప్పటికే మంచి బిజినెస్ అయ్యింది.

మంచి రిలీజ్ డేట్ చూసి విడుదల చేస్తే తప్పకుండా కమర్షియల్‌ గా మంచి విజయాన్ని కార్తికేయ 2 సాధించే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. మరి ఆ మంచి విడుదల తేదీ కార్తికేయ 2 కు దొరికేనా చూడాలి.
Tags:    
  • Karthikeya 2 
  • Kalyan Ram 
  • Bimbisara 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS