బికినీ బీచ్ లో హీట్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ

Update: 2020-12-06 10:30 GMT
మాల్దీవ‌ల్లో బిగ్ బాస్ బ్యూటీ హ‌ల్చ‌ల్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల కాజ‌ల్ -తాప్సీ- ఎల్లీ అవ్ రామ్ వంటి టాప్ బ్యూటీస్ మాల్దీవుల విహారంలో అగ్గి రాజేసారు. అయితే అంత‌కుమించి అన్న తీరుగా చెల‌రేగిపోతూ బిగ్ బాస్ ఫేం హీనాఖాన్ వాడి వేడిగా యువ‌త‌రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

హీనా ఖాన్ తన ప్రియుడు రాకీ జైస్వాల్  ఆమె తల్లిదండ్రులతో మాల్దీవుల్లో విహారయాత్రలో ఉంది. గ‌త కొద్ది రోజులుగా విస్తృతమైన ఫోటోషూట్లలో పాల్గొన్న హీనా ఒక్కో ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేస్తూ వేడి పెంచేస్తోంది.  సెల‌బ్రేష‌న్ ముగించి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా హినా తన ఫోటోషూట్ల‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ని విడుద‌ల చేస్తూనే ఉంది.

`చీర్స్ టు లైఫ్` అంటూ తాజాగా కొన్ని ఫోటోల్ని రివీల్ చేసింది. ఇందులో ఫోటోలు అంత‌కంత‌కు హీట్ పెంచేస్తున్నాయి.  సముద్రతీరంలోని ఓ డాబాపై ఫోటోల‌కు ఫోజిచ్చింది. అలాగే కొన్నిచోట్ల‌ దుప్పటితో కప్పబడిన‌వి ఉన్నాయి. ఆమె షాంపైన్ గ్లాస్ (కనిపించేది) పట్టుకుని ఉన్న ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. శనివారం, ఆమె నీలిరంగు పోల్కా-డాట్ బికినీ ధ‌రించి సన్ గ్లాసెస్ పెట్టుకుంది. పెద్ద టోపీ ధరించి మైసూర్ మ‌హారాణినే త‌ల‌పించింది.

ఇంతకుముందు ఒక సీప్లేన్ పక్కన ఫోటోషూట్ తో హ‌ల్ చ‌ల్ చేసింది.  కొన్నిసార్లు కొలను వ‌ద్ద‌.. హోటల్ గది లోపలి నుండి వీడియోలను పంచుకుంది.

కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు హనీమూన్,.. కత్రినా కైఫ్ విజిట్.. టైగర్ ష్రాఫ్ -దిషా పటాని మాల్దీవుల్లో కొన్ని రోజులు గడిపిన సంగ‌తి తెలిసిందే.  ఆధార్ జైన్ తన పుట్టినరోజు పర్యటనలో భాగంగా స్నేహితురాలు తారా సుతారియాతో కలిసి మాల్దీవుల విహారానికి విచ్చేశాడు. ఆ త‌ర్వాత హీనా సెల‌బ్రేష‌న్ మంటలు పుట్టిస్తోంది.

బిగ్ బాస్ 14 లో గౌహర్ ఖాన్ - సిధార్థ్ శుక్లాతో పాటు ‘సీనియర్ పోటీదారుగా’ హీనా కనిపించారు. ఆమె రెండు వారాల పాటు ఇతర సీనియర్లతో పోటీప‌డినా చివ‌రికి నింటి నుండి నిష్క్రమించింది.
Tags:    

Similar News