ఈమె విలన్‌ గా సెట్‌ అయ్యేనా?

Update: 2020-04-11 10:30 GMT
హీరోయిన్‌ గా సీనియర్‌ స్టార్‌ హీరోలతో పాటు ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోల్లో పలువురితో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భూమిక చావ్లా. ఈ అమ్మడు కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. కాలక్రమేనా హీరోయిన్‌ గా ఈమెకు ఛాన్స్‌ లు లేకుండా పోయాయి. కొంత గ్యాప్‌ తీసుకున్న ఈమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అక్క.. వదినా.. అమ్మ పాత్రల్లో ఈమె నటించేందుకు సిద్దం అయ్యింది.

భూమిక తాజాగా బాలకృష్ణ.. బోయపాటిల కాంబో మూవీలో నటించేందుకు కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. బోయపాటి ఆ సినిమాలో ఈమెకు లేడీ విలన్‌ రోల్‌ ను ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన భూమిక విలన్‌ గా అంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారా లేదా అనేది అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. విలన్‌ గా అది కూడా లేడీ విలన్‌ గా మెప్పించాలంటూ సాదారణమైన విషయం కాదు.

బోయపాటి ఏ నమ్మకంతో ఆమెకు ఈ ఆఫర్‌ ఇచ్చాడో కాని ఇది ఆమెకు చాలా పెద్ద ఛాలెంజ్‌ అంటున్నారు. బాలకృష్ణ గత చిత్రం రూలర్‌ లో కూడా ఈమె నటించిన విషయం తెల్సిందే. వెంటనే బాలయ్య మరో సినిమాలో కూడా ఈమెకు ఛాన్స్‌ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ అన్ని కూడా బంద్‌ ఉన్నాయి. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ ను ప్రారంభించనున్నారు. అప్పుడు భూమిక కూడా పాల్గొనబోతున్నట్లుగా యూనిట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.



Tags:    

Similar News