• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిబి4 : మోనాల్‌ కాదు...

బిబి4 : మోనాల్‌ కాదు అవినాష్‌ ఔట్‌

By - Tupaki Desk
Update: 2020-12-06 03:51 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ ఆది వారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నది ఎవరు అనే విషయం ప్రతి శనివారం సాయంత్రం వరకు లీక్‌ వచ్చేస్తుంది. కావాలని లీక్‌ చేస్తున్నారో లేదా అనుకోకుండా జరుగుతుందో తెలియదు కాని ప్రతి వారం లీక్‌ అయితే వస్తుంది. ఎప్పటిలాగే నిన్న శనివారం కూడా లీక్‌ వచ్చింది. మోనాల్‌ ఎలిమినేట్‌ అవ్వబోతుంది అంటూ మీడియా వారు అంతా కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. కాని అనూహ్యంగా మోనాల్‌ సేవ్‌ అయ్యిందని.. ముక్కు అవినాష్‌ ఎలిమినేట్‌ అంటూ మళ్లీ అదే మీడియా వారు కాస్త పొద్దు పోయాక అంటే రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో సోషల్‌ మీడియాలో తమ పోస్ట్‌ లను సరి చేసుకుని మళ్లీ షేర్‌ చేయడం జరిగింది.

మోనాల్‌ ను మొదటి నుండి బిగ్‌ బాస్‌ సేవ్‌ చేస్తూ వచ్చాడు అంటూ విమర్శలు ఉన్నాయి. ఈ వారం కూడా మోనాల్‌ ను బిగ్‌ బాస్‌ చేసి ఉంటాడా అనేది పక్కన పెడితే అవినాష్‌ వెళ్లి పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే అవినాష్‌ తీరుపై ప్రేక్షకులకు విసుగు వచ్చింది. టాస్క్‌ సమయంలో మరేదైన సమయంలో అతడు ఎలిమినేషన్‌ లో ఉంటే వింతగా ప్రవర్తిస్తాడు. ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తున్నారో అంటూ ఆయన ఆందోళన పడుతూ వీక్‌ అంతా ఉన్నాడు. అందుకే అతడి హడావుడి కారణంగా ప్రేక్షకులు ఓట్లు వేయలేదు అనిపించింది.

ప్రతి వారం మోనాల్‌ ను బిగ్‌ బాస్‌ సేవ్‌ చేస్తున్నాడేమో కాని.. ఈ వారం మాత్రం అవినాష్‌ ను ప్రేక్షకులు బయటకు పంపినట్లుగా అనిపిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో కూడా టాక్‌ నడుస్తుంది. ఫైనల్‌ 5 కి ఖచ్చితంగా ఉంటాడు అనుకున్న అవినాష్ తన అతి భయం మరియు అత్యుత్సాహం కారణంగానే ఎలిమినేట్‌ అయ్యాడు అనిపిస్తుంది. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో అవినాష్ ఎలిమినేషన్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. స్టేజ్‌ పై అతడు మాట్లాడే మాటలు ఎలా ఉండబోతున్నాయి అనేది అందరికి ఆసక్తికరంగా ఉన్నాయి.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS