ప్రదీప్‌ స్పందించాడోచ్‌

Update: 2020-02-03 10:06 GMT
బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ప్రదీప్‌ ను ఓ రేంజ్‌ లో అభిమానులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్‌ భారీగా ఉండే ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. గతంలో పలు చిత్రాల్లో కనిపించిన ప్రదీప్‌ హీరోగా నటించడం మొదటి సారి అవ్వడం తో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. ప్రదీప్‌ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారు షాక్‌ అయ్యేలా సునిశిత్‌ అనే దర్శకుడు ప్రదీప్‌ పై కేసు పెట్టిన విషయం తెల్సిందే.

అమ్మాయిని వేదించిన కేసులో రెండు రోజులు జైలుకు వెళ్లిన ప్రదీప్‌ సెంట్రల్‌ ఫిల్మ్‌ బోర్డ్‌ రూల్స్‌ ప్రకారం హీరోగా చేసేందుకు అనర్హుడు. అందుకే ప్రదీప్‌ ను హీరోగా పరిచయం చేస్తున్న ఆ సినిమాను వెంటనే ఆపేయాలంటూ సునిశిత్‌ ఫిర్యాదులో పేర్కొన్న విషయంతెల్సిందే. గత రెండు మూడు రోజులుగా ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రదీప్‌ స్పందించాడు.

నేను జైలుకు వెళ్లినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో తాను కౌన్సిలింగ్‌ కు మాత్రమే వెళ్లాను. జైలుకు తాను వెళ్లినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నాడు. నిజాలు తెలుసుకోకుండా ఇలా అబద్దాలను రాయడం మీడియాకు తగదన్నాడు. ఇక తనపై కేసు పెట్టిన సునిశిత్‌ ఎవరో కూడా తనకు తెలియదన్నాడు. అతడి పేరు కూడా మొదటి సారి వింటున్నట్లుగా చెప్పాడు.
Tags:    

Similar News