ఔను.. సెక్స్ సినిమా చేశా
తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాంబుల మీద బాంబులు పేల్చాడు బండ్ల గణేష్. రవితేజను పొలం పేరుతో మోసం చేశానన్నాడు. పవన్ కళ్యాణ్ తనను ఒరేయ్ అంటాడని.. ఆయన విషయంలో ఇగో చూపించి రెండేళ్లు దూరంగా ఉన్నానని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో గొడవ మీదా స్పందించాడు. ఇవన్నీ ఒకెత్తయితే తాను ఒకప్పుడు సెక్స్ సినిమాలో నటించిన సినిమా వాస్తవమే అంటూ బండ్ల గణేష్ ఒప్పుకోవడం విశేషం. ‘‘అవును.. నేను ఒకప్పుడు కెరీర్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో సెక్స్ సినిమా చేశాను. ఆ సినిమా పేరు.. ప్లీజ్ ఆంటీ. నాకు ఇండస్ట్రీలో అవకాశాలు లేనపుడు ఇంకా చాలా చేశాను’’ అని బండ్ల గణేష్ తెలిపాడు.
తాను అంత కష్టపడుతున్న టైంలో తనకు కమెడియన్ గా అవకాశమిచ్చి ఇంత కెరీర్ ఇచ్చిన ఘనత మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డిదేనని బండ్ల గణేష్ తెలిపాడు. ‘‘వినోదం సినిమాతో నాకు తొలి బ్రేక్ లభించింది. చిన్న ఆర్టిస్టుగా మొదలై.. కమెడియన్ అయ్యాను. నిర్మాతగా కూడా మారాను. నేను ఎస్వీ కృష్ణారెడ్డిగారి ప్రాడక్ట్ అని గర్వంగా చెప్పుకుంటాను. ఆయన్ని కలిసినపుడల్లా కాళ్లకు మొక్కుతాను. ఆయన దర్వకత్వంలో నా బేనర్లో సినిమా నిర్మించాలనుకుంటున్నా. ఇది నేను ఆయనకు చేసే సాయం కాదు. అది నా బేనర్ కు ఒక గౌరవంగా భావిస్తా. ఆయన్ని సినిమా చేయమని అడుగుతున్నా. తరచుగా కలుస్తున్నా. ఆయన కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఆయనతో చేయడానికి ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నా’’ అని బండ్ల అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/