పవన్ హీరోయిజం 2019లో తెలుస్తుంది
అసలు పవర్ స్టార్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలన్నీ ఆయన రాసుకున్నవేనా? ఆయన పొలిటికల్ స్పీచులు ఎవరు రాస్తున్నారు? సాధారణంగా ఈ ప్రశ్నను అడగ్గానే అందరూ కూడా పవన్ మాటలన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాస్తున్నాడని అనుకుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది? అదే విషయం నిర్మాత బండ్ల గణేష్ ను అడిగితే.. మనోడు ఠారెత్తించే ఆన్సర్ చెప్పాడు.
''అర్హత లేని జనం.. అలాగే అందని ద్రాక్ష పండు పుల్లను అనేవారికి.. ఇద్దరు స్నేహితుల మధ్యన గొడవలు పెడుతుంటారు. అది మంచి పద్దతి కాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర. ఆయన రూములోకి వెళితే వీడియో కాసెట్లు.. ఆడియో డివిడిలు ఉండవ్. అక్కడ బుక్స్ ఉంటాయి. ఆయనకు స్పీచులు రాసిచ్చేవాడు ఇంకా పుట్టలేదు. పుట్టడు కూడా. ఆయనే 10 మందికి రాసిస్తాడు. త్రివిక్రమ్ రాసిస్తే పోయి చెప్తాడా? అది అబద్దం'' అంటూ కాస్త ఘాటుగా కామెంట్ చేశాడు. ఇద్దరు గొప్ప మేథావులు (పవన్ అండ్ త్రివిక్రమ్) మధ్యన గొడవలు పెట్టకండి ప్లీజ్ అన్నాడు గణేష్.
పవన్ కళ్యాణ్ గురించి ఇంకాస్త మాట్లాడుతూ.. ''ఆయన క్యారెక్టర్ వేరు. ఆయన కెపాసిటి వేరు. ఆయన క్యాలిబర్ రేంజ్ అనేదే సెపరేటు. ఆయనతో ఒక రోజు గడిపితే ఆ విషయం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తాలూకు అసలు హీరోయిజమ్ ఏంటనేది రేపు 2019లో తెలుస్తుంది'' అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/