బాలయ్య-మహేష్ మీటింగ్ నిజమేనా?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరికి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను విడుదల చేసే ప్లానింగ్ లో ఉండడంతో విరామం లేకుండా.. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ సభ్యులు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అన్ని ముఖ్య పాత్రలకు ప్రముఖ నటులను తీసుకున్నారు. అదేకోవలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను అయన తనయుడు మహేష్ బాబు తో చేయించాలనేది బాలయ్య-క్రిష్ ల ఆలోచనట.
మహేష్ బాబు 'మహర్షి' షూటింగ్ కారణంగా అమెరికాలో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ లో కృష్ణ పాత్ర గురించి మహేష్ బాబు తో బాలయ్య ఫోన్ లో మాట్లాడడం జరిగిందట. కానీ మహేష్ ఈ ప్రపోజల్ కు పెద్దగా ఆసక్తి చూపించలేదని.. కాస్త సమయం కావాలని బాలయ్యను అడిగాడని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే మహేష్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి వస్తున్నాడట. మహేష్ వచ్చిన తర్వాత బాలయ్య పర్సనల్ గా తనను కలిసి కృష్ణగారి పాత్రను పోషించే విషయం మాట్లాడాలని.. కన్విన్సు చెయ్యాలని బాలయ్య ఆలోచనట. ఎలాగైనా ఆ పాత్రను మహేష్ చేస్తేనే బాగుంటుందని పట్టుదలగా ఉన్నాడట బాలయ్య.
మరి ఇది ఉత్త రూమరేనా లేదంటే ఇందులో నిజం ఉందా అనేది ఇంకా తెలీదు గానీ ఒక్కటి మాత్రం నిజం. ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ కృష్ణగారి పాత్ర చేసే అదిరి పోతుందంతే. అసలే 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ మీసాలు పెట్టుకున్న సీన్స్ లో నాన్నగారిలాగానే ఉన్నాడు. ఇక నందమూరి నాన్నగారూ.. ఘట్టమనేని నాన్నగారు.. ఒకే ఫ్రెం. ఆ రోజు.. ఆహా.. ఏమి ఊహ~!