ఫోటో స్టోరీ: రిక్షావోడు మ‌న‌ ఎన్టీవోడు!

Update: 2018-10-08 04:07 GMT
ఆరోజుల్లో ఎన్టీవోడి ఇస్ట‌యిల్ చూడాలి. ఆన్ లొకేష‌న్ ఆ ద‌ర్పం చూసి తీరాలి. ఎన్టీవోడి ముందు ఎవ‌రైనా రొమ్ము విరుచుకుని - కాల‌రెగరేసి తిరిగే మొన‌గాడు ఉన్నాడా? అంటే.. అస‌లు అంత సీనే లేదు. ఆర‌డుగుల క‌టౌట్ ఆన్‌ లొకేష‌న్‌ లో వెళుతుంటే ఎదురుప‌డే ద‌మ్ము ఎవ‌రికీ ఉండేది కాదు. ఏంటి బ్ర‌ద‌ర్‌! అంటూ ఆయ‌న ఒక చూపు ఇలా విసిరేస‌రికే అవ‌త‌లివారి వెన్నులో ఒణుకు పుట్టేద‌ని చెప్పేవారు. గంభీర‌మైన ఆ స్వ‌రం.. తీరైన ఆ స్ఫుర‌ద్రూపం (కటౌట్‌) చూసి అల్లంత దూరంలోనే ఆగిపోయి అచేత‌నుడై చూసేవార‌ట‌. ప‌లు సంద‌ర్భాల్లో చ‌ల‌ప‌తిరావు లాంటి సీనియ‌ర్ ఆర్టిస్టు ఆ సంగ‌తిని చెప్పిన సంగ‌తిని గుర్తు చేసుకోవాలి.

ఇప్పుడు బాల‌య్య‌ను చూస్తున్నా అలానే ఉంది స‌న్నివేశం. అదే క‌రిష్మా.. అదే క‌టౌట్.. వేట‌గాడిలా హ్యాటు .. వ్య‌వ‌హారం.. ఆహా! అచ్చుగుద్దిన‌ట్టు ఎన్టీవోడే. అంత పెద్దాయ‌న రిక్షా తొక్కితే ఎలా ఉంటది? ఇదిగో ఇలా ఉంట‌ది!  రిక్షా ఎక్కిన ఎన్టీవోడు.. చాలానే త‌మాషా చేసిండు!! తెల్ల చొక్కాయ్.. తెల్ల ప్యాంటు.. కాంబినేష‌న్ బ్లాక్ షూస్‌.. పైన కాంబినేష‌న్ బ్రౌన్ హ్యాటు.. రెబాన్ క‌ళ్ల‌ద్దం.. ఇలా చూశాక‌ వ్వావ్‌! అన‌కుండా ఉండ‌గ‌ల‌రా.. ఎవ‌రైనా?

ఇంత‌కీ ఆ రిక్షా అద్దంలో ఏం చూస్తున్నారు బాసూ? ఆ న‌ల్ల రంగు క‌ళ్ల‌ద్దం సూటైందో  లేదో చూస్తున్నారా? హ‌్యాటుకు కాంబినేష‌న్ సెట్ట‌య్యిందో లేదో చూస్తున్నారా? ఇంత‌కీ వేట‌గాడు రిక్షా తొక్కే సీనా?   లేక సాంగు షూటింగా?  ఆ రిక్షా డెక‌రేష‌న్ కూడా అంతే సోగ్గా ఉందే!  బావుంద‌య్యో బాల‌య్యో..!  విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ ఆన్ లొకేష‌న్ ఎంత సంద‌డిగా ఉండేవారో ఆ సంద‌డి అంతా బాల‌య్య‌లో క‌నిపిస్తోంది. ఎన్టీఆర్ 1 - 2 చిత్రాలు జ‌న‌వ‌రిలో రిలీజ్‌ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
Tags:    

Similar News