ఇతడే చిన్నారి పెళ్లికూతురు ప్రియుడు
బాలికావధు సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న అవికా గౌర్ తెలుగులో హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అవికా ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. మద్యలో లావు తగ్గేందుకు అన్నట్లుగా కాస్త గ్యాప్ తీసుకుంది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నట్లుగా ఇటీవలే ప్రకటించిన అవికా గౌర్ కు పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు. దాంతో ఈ అమ్మడు లైఫ్ లో సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తన ప్రియుడు ఫిటోను అవికా షేర్ చేసింది. మిలింద్ చద్వానీతో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పేసింది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాలో స్ఫూర్తిని నింపే వ్యక్తి నాకు తారసపడ్డాడు. నా లైఫ్ కు ఎట్టకేలకు లవ్ దొరికింది అంటూ ప్రేమలో మునిగి తేలుతున్న ఫీలింగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రాని సమయంలో ఈమె తన ప్రియుడి ని పరిచయం చేయడం.. ప్రేమ విషయాన్ని వెళ్లడించడంతో త్వరలోనే అవికా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చద్వానీ గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.