• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవతార్ రికార్డుకు ఎసరు...

అవతార్ రికార్డుకు ఎసరు పెట్టనున్న అవెంజర్స్

By - Tupaki Desk
Update: 2019-06-13 17:30 GMT
బాక్స్ ఆఫీస్ రికార్డుల విషయంలో ఇండియాకు 'బాహుబలి' ఎలానో ప్రపంచం మొత్తానికి 'అవతార్' అలాగ.  $2.78 బిలియన్ గ్రాస్ తో ప్రపంచంలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'అవతార్' ఇప్పటికీ కొనసాగుతోంది.  జేమ్స్ కామెరూన్ దర్శకత్వలో తెరకెక్కిన 'అవతార్' 2009 లో విడుదలైంది.  అప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ ఏ ఒక్కటీ 'అవతార్' కలెక్షన్లకు దరిదాపుల్లోకి చేరలేకపోయింది.  ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఆ రికార్డుకు 'అవెంజర్స్: ఎండ్ గేమ్' ఎసరుపెట్టేలా ఉంది.

ఏప్రిల్ 26 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా $2.73 బిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.   ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో రెండవ స్థానంలో ఉన్న 'టైటానిక్' ను మూడవ స్థానానికి నెట్టేసిన ఈ చిత్రం ప్రస్తుతం 'అవతార్' రికార్డుకు ఎసరు పెట్టే దిశగా కొనసాగుతోంది.  ఈ సినిమా రిలీజై దాదాపు ఒకటిన్నర నెల దాటినా ఇంకా కలెక్షన్స్ ఫిగర్ పెరుగుతూనే ఉంది.  ఇదే ఊపు కొనసాగితే అతి త్వరలో 'అవతార్' హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డు గోవిందా గోవిందా!

మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ చిత్రానికి బడ్జెట్ $356 మిలియన్లు. ఇప్పటికే సినిమా బడ్జెట్ కు ఏడు రెట్లు కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఫిగర్ వచ్చేసరికి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ చిత్రం ఇండియాలోనే మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడం గమనార్హం. ఈ సినిమాకు దర్శకత్వం వహించినవారు రూసో బ్రదర్స్. రాబర్ట్ డౌనీ జూనియర్.. మార్క్ రఫాలో.. క్రిస్ హెమ్స్ వర్త్.. స్కార్లెట్ జాన్సన్.. జెరెమీ రెన్నర్.. పాల్ రడ్.. బ్లీ లార్సన్ .. బ్రాడ్లీ కూపర్.. జోష్ బ్రోలిన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Tags:    
  • Avengers End Game 
  • Avtar Movie 
  • Telugu NEws 

Similar News

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS