• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2018 డిసెంబరు 21.. సినీ...

2018 డిసెంబరు 21.. సినీ ప్రపంచం షేకైపోతుంది

By - Tupaki Desk
Update: 2016-11-27 13:30 GMT
ప్రపంచ సినిమా చరిత్రలో ‘అవతార్’ ప్రభంజనం గురించి ఒక ప్రత్యేక అధ్యాయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచం నలుమూలలా చొచ్చుకువెళ్లి.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించింది ఈ చిత్రం. ఇండియాలో మన రీజనల్ సినిమాల్ని ఎలా ఆదరిస్తారో.. ‘అవతార్’ను కూడా అదే రకంగా చూశారు ప్రేక్షకులు. ఈ చిత్రానికి సీక్వెల్ అని జేమ్స్ కామెరూన్ ప్రకటించిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ఇంకో రెండేళ్ల తర్వాతే తెరపడనుంది. అవతార్-2 ముందు అనుకున్నట్లు 2017లో కాకుండా.. ఏడాది ఆలస్యంగా విడుదల కానుంది.

2018 డిసెంబరు 21న ‘అవతార్-2’ ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్. ‘అవతార్’కు ఒకేసారి నాలుగు సీక్వెల్స్ తీస్తుండటం వల్ల రెండో భాగం విడుదల ఆలస్యమవుతోంది. ఐతే ఆ తర్వాత వచ్చే మూడు సీక్వెల్స్ కోసం ఎక్కువ సమయం తీసుకోరు. అవి వరుసగా 2020.. 2022.. 2023లో రిలీజవుతాయని కామెరూన్ ప్రకటించాడు. సీక్వెల్ గురించి ఆయన చెబుతూ.. ‘‘అవతార్-2 స్టోరీ లైన్ పూర్తిగా ఒరిజనల్ లోని జాక్-జోల కథ లాగానే సాగుతుంది. ఈ సీక్వెల్లో వారి పిల్లలు కూడా కనిపిస్తారు. మనషులతో వారికి వచ్చే సమస్యల నేపథ్యంలో ఈ కుటుంబ కథ సాగుతుంది’’ అన్నాడు. తొలి భాగం పండోరా గ్రహం నేపథ్యంలో సాగగా.. సీక్వెల్స్‌ లో ఆ గ్రహంలోని సముద్ర జలాల అందాలను ఆవిష్కరించబోతున్నాడు కామెరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు. సాంకేతికంగా ‘అవతార్‌’ను మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Avatar 2 Movie 
  • Telugu NEws 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS