• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోగా మరో ప్రయత్నం.....

హీరోగా మరో ప్రయత్నం.. ఇక్కడ కాదు!

By - Tupaki Desk
Update: 2018-09-09 01:30 GMT
ఫ్యామిలీ హీరోగా 1990ల్లో స్టార్‌డంను దక్కించుకున్న జగపతిబాబు గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా - విలన్‌గా నటిస్తూ ఉన్న విషయం తెల్సిందే. హీరోగా నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్న కారణంగా జగపతిబాబు ‘లెజెండ్‌’ చిత్రంతో విలన్‌ గా కొత్త ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టాడు. ఈ కొత్త ఇన్నింగ్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం - కన్నడం - హిందీ చిత్రాల్లో కూడా జగపతిబాబుకు విలన్‌ గా - క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఛాన్స్‌ లు దక్కాయి. తమిళంలో ఎన్నో భారీ చిత్రాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు దక్కించుకున్న జగపతిబాబు అక్కడ మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు.

తమిళనాట భారీ ఎత్తున అంచనాల నడుమ తెరకెక్కబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో జగపతిబాబు ఒక హీరోగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అన్‌ బరసన్‌ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. విభిన్నమైన కథంశంతో ఈ చిత్రంను అన్‌ బరసన్‌ తెరకెక్కించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. యాక్షన్‌ కింగ్‌ మెచ్చిన కథ ఇది. ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ చిత్రం కోసం జగపతిబాబుతో మాట్లాడినట్లుగా చెన్నై టాక్‌.

అర్జున్‌ మరియు జగపతిబాబులతో పాటు మరో ఇద్దరు సీనియర్‌ హీరోలు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ నటుడు జాకీష్రాప్‌ ఒక హీరోగా కాగా మరో హీరోను త్వరలో ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో మల్టీస్టారర్‌ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారట. చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా జగపతిబాబు నటిస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల దృష్టి కూడా ఆ తమిళ చిత్రంపై ఉంది. ఆ మల్టీస్టారర్‌ చిత్రం తెలుగులో కూడా డబ్‌ అయ్యే అవకాశం ఉంది. విలన్‌ గా - క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి ఫాంలో ఉన్న సమయంలో మళ్లీ హీరో పాత్రలు చేయడం అనేది సాహస నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి జగ్గూభాయ్‌ ఆ మల్టీస్టారర్‌ తో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడో చూడాలి.
Tags:    
  • Arjun 
  • Jackie 
  • Jagapathi Babu 
  • Telugu NEws 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS