• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్‌4 లో అరవిందసమేత...

అఖిల్‌4 లో అరవిందసమేత కాంబో?

By - Tupaki Desk
Update: 2020-02-04 07:12 GMT
అఖిల్‌ 4వ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ లో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అఖిల్‌ కు ఈ సినిమా సక్సెస్‌ చాలా కీలకం. అదే విధంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాతో పూర్వ వైభవం పొందేందుకు బొమ్మరిల్లు భాస్కర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.

షూటింగ్‌ ఇన్ని రోజులు జరిగిన తర్వాత అఖిల్‌ 4 మూవీలో పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్‌ కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగమ్మాయి ఈషా రెబ్బాను ఈ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ గా తీసుకున్నారట. ఇప్పటికే అఖిల్‌.. ఈషాలపై కొన్ని సీన్స్‌ కూడా చిత్రీకరించారని సమాచారం అందుతోంది. ఈషా రెబ్బా హీరోయిన్‌ గా ఒక మంచి బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. చిన్న సినిమాల్లో మెయిన్‌ లీడ్‌ లో నటిస్తున్న ఈమె పెద్ద హీరోల సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించేందుకు మొహమాటం లేకుండా ఓకే చెప్పేస్తుంది.

అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించగా మరో హీరోయిన్‌ గా ఈషా రెబ్బా నటించింది. ఇప్పుడు పూజా హెగ్డేతో కలిసి మరోసారి స్క్రీన్‌ ను షేర్‌ చేసుకునేందుకు ఈషా రెబ్బా అఖిల్‌ 4 సినిమాతో రెడీ అయ్యింది. అరవింద సమేత చిత్రంలో వీరిద్దరి కాంబో కనిపించింది. మళ్లీ ఇప్పుడు అఖిల్‌ 4 తో ఆ కాంబో రిపీట్‌ అవ్వబోతుంది. అరవింద సమేత చిత్రం ఆశించిన స్థాయి లో ఆకట్టుకో లేదు. మరి ఈ ముద్దు గుమ్మల జోడీ అఖిల్‌ 4 తో అయినా కమర్షియల్‌ గా సక్సెస్‌ ను దక్కించుకుంటుందో చూడాలి.
Tags:    
  • Akhil 4 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Pooja Hegde And Eesha Rebba In Akhil 4 
  • Telugu News 
  • latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS