ఇది ఫిక్స్‌.. అనుష్క 10నిమిషాలే

Update: 2015-07-09 15:34 GMT
ఇంకో 24 గంటల్లోపే బాహుబలి ఫలితం తేలిపోనుంది. ఈరోజు మిడ్‌నైట్‌ నుంచే ప్రత్యేక షోలతో నగరాలన్నీ హోరెత్తిపోనున్నాయి. అభిమానుల్లో టెన్షన్‌ గంట గంటకు రెట్టింపు అవుతోంది. ఈ చిత్రంలో ఏ క్యారెక్టర్‌ ఏ రేంజులో ఉంటుందో అని ఊహించుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రానా రాజాధిరాజాగా అరివీర భయంరుడిగా కనిపించబోతున్నాడు. అయితే అనుష్క ఏ రేంజులో కనిపిస్తుంది? అని ఆరాతీస్తే ఓ సంగతి తెలిసింది.

ఈ చిత్రంలో అనుష్క పాత్ర పరిధి చాలా స్వల్పమని రివీల్‌ అయ్యింది. కేవలం పది నిమిషాల నిడివిలో మాత్రమే అనుష్క కనిపిస్తుంది. అది కూడా ప్రభాస్‌కి తల్లి పాత్రలో దర్శనమిస్తుందిట. ముందే చెప్పినట్టు అనుష్క రెండో భాగంలో మాత్రమే సినిమా ఆద్యంతం కనిపిస్తుంది. బాహుబలి : ది బిగినింగ్‌లో మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా తన భుజస్కంధాలపై నడిపిస్తుంది. రెండు భాగాల్లోనూ ప్రభాస్‌ కనిపిస్తాడు. తొలిభాగంలో తమన్నాతో రొమాన్స్‌ చేస్తాడు. రెండో భాగంలో అనుష్కతో కలిసి రాకుమారుడిగా అలరిస్తాడు. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్‌ ఫార్మాట్‌లో రివీల్‌ అవుతాయన్నమాట!

Tags:    

Similar News